Ramcharan RC 15 movie: 'ఆచార్య'తో నిరాశపరిచిన మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న తాజా చిత్రం 'ఆర్సీ15'. శంకర్ దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి రోజుకో ఆసక్తికరమైన వార్త బయటకు వస్తూనే ఉంది. అయితే తాజాగా మెగాఫ్యాన్స్‌లో ఫుల్‌జోష్‌ను నింపే మరో వార్త సినీవర్గాల్లో చక్కర్లు కొడుతోంది. నిన్నటివరకు ఈ మూవీలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్ రాగా ఇప్పుడు త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు తెలిసింది. అంతేకాదు అందులో ఒక పాత్ర పూర్తి నెగటివ్‌గా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. తండ్రి, ఇద్దరు కొడుకులుగా చరణ్ నటిస్తున్నారట!కొడుకుల్లో ఒకరు ప్రతినాయకుడిగా కూడా కనిపిస్తారని, అది సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే చరణ్ కెరీర్లోనే తొలిసారి త్రిపాత్రాభియనం చేసినట్లు అవుతుంది.
'నాగేశ్వరరావు'గా చైతూ.. రామ్‌చరణ్ త్రిపాత్రాభినయం! - నాగచైతన్య పరశురామ్ టైటిల్
శంకర్‌తో చేస్తున్న సినిమాలో రామ్‌చరణ్ నటిస్తున్నది ద్విపాత్రాభినయంలో కాదని త్రిపాత్రాభినయం అని జోరుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు పరశురామ్-నాగచైతన్య సినిమా టైటిల్ ఖరారు అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు..
Parasuram Nagachaitanya movie title: 'సర్కారు వారి పాట'తో హిట్ కొట్టిన దర్శకుడు పరశురామ్.. తన తర్వాతి సినిమా యువ హీరో నాగచైతన్య చేయబోతున్నారని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ గురింటి ఇంట్రెస్టింట్ న్యూస్ బయటకు వచ్చింది. పలు పేర్లను పరిశీలించిన మూవీటీమ్.. ఓ పేరును ఎంపిక చేసినట్లు తెలిసింది. 'నాగేశ్వరరావు' అనే టైటిల్‌ను ఖరారు చేశారట. ఇందులో చైతూ.. మిడిల్ క్లాస్ ఉద్యోగిగా కనిపిస్తారట. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని సమాచారం. హీరోయిన్ను కూడా ఎంపిక చేసే పనిలో ఉన్నారట. త్వరలోనే ఈ సినిమా గురించి అధికార ప్రకటన వచ్చే అవకాశముంది.
ఇదీ చూడండి:బ్రేక్స్ ఫెయిల్.. ప్రమాదం నుంచి తప్పించుకున్న విజయ్!