బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్'. పూజా హెగ్డే హీరోయిన్. తాజాగా ఈ సినిమాలోని 'ఏంటమ్మ.. ఏంటమ్మ..' అంటూ సాగే పాటను విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్‌లో సల్మాన్‌తో పాటు.. విక్టరీ వెంకటేశ్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కూడా అదిరిపోయేలా లుంగీ స్టెప్పులేశారు.
లుంగీ డ్యాన్స్ అంటే ప్రేక్షకులకు 'చెన్నై ఎక్స్‌ప్రెస్' సినిమాలోని షారుఖ్ ఖాన్, దీపికా పదుకోన్ వేసిన స్టెప్పులే గుర్తుకొస్తాయి. అయితే ఇప్పుడొచ్చిన ఈ సాంగ్‌తో ఓ నయా ట్రెండ్ సెట్ చేశారు కిసీకా భాయి కిసీకీ జాన్ టీమ్. ఇందులోని స్టార్స్ వేసిన స్టెప్పుల గురించి ఇప్పుడు నెట్టింటంతా టాక్. ఇందులో రామ్ చరణ్ స్పెషల్ అప్పీయరెన్స్ పాటకు హైలైట్‌గా నిలిచిందని అభిమానులు సంబరాలు చేసుకంటున్నారు. ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు.
ఆ అనుబంధంతోనే...
కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు, మెగా ఫ్యామిలీ మధ్య మంచి అనుబంధం ఉంది. అందుకనే చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' సినిమాలో సల్మాన్ ఖాన్ ఓ స్పెషల్ రోల్లో మెరిశారు. మరోవైపు హిందీలో రామ్ చరణ్ 'జంజీర్' సినిమా చేసినప్పుడు కూడా సల్మాన్ మద్దతు ఇచ్చారు. ఇక సల్మాన్ హైదరాబాద్ వస్తే మెగాస్టార్ ఇంటికి తప్పకుండా వెళ్తారు. ఆ అనుబంధం వల్లనే ఇప్పుడు ఈ సినిమాలోనూ రామ్ చరణ్ ఓ స్పెషల్ రోల్లో మెరిశారు.
వెంకీ ఐడియాకు సల్లూ భాయ్ ఓకే..
ఇప్పటికే ఈ సినిమా నుంచి 'బతుకమ్మ' అనే సాంగ్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. 'కె.జి.యఫ్' ఫేమ్ రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం అందించారు. అయితే సినిమాలోని ఓ సందర్భంలో ఈ పాట పెడితే బాగుంటుందని విక్టరీ వెంకటేశ్ సలహా ఇచ్చారట. ఇక ఆ ఐడియా నచ్చిన సల్మాన్ ఖాన్ వెంటనే ఈ పాట పెట్టమని దర్శక, నిర్మాతలకు సూచనలిచ్చారట. సుమారు 200 మంది డ్యాన్సర్లతో పాటు హీరో హీరోయిన్లు ఈ పాటకు స్టెప్పులేసి అలరించారు. ఇక ఈ పాటలో నటి భూమిక కూడా మెరిశారు.
ఇక సినిమా విషయానికి వస్తే.. బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక పూజహెగ్డేకు అన్నయ్య పాత్రలో టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ ఓ ప్రత్యేక పాత్రలో మెరవనున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌తో అదరగొడుతున్న ఈ సినిమా ఏప్రిల్ 21న థియేటర్లలో సందడి చేయనుంది. అటు హిందీతో పాటు ఇటు తెలుగు స్టార్స్ ఉన్నందున ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.