తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రామ్​చరణ్​-ఉపాసన ఫేవరెట్ యాక్టర్స్​ ఎవరో తెలుసా? - ఉపాసన ఫేవరెట్ యాక్టర్

'మగధీర'తో టాలీవుడ్​ రికార్డులన్నింటినీ తిరగరాసి.. 'ఆర్​ఆర్​ఆర్'​తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్న మెగాహీరో రామ్​చరణ్​కు ఇష్టమైన నటుడెవరో తెలుసా? ఈ విషయాన్ని ఆయన భార్య ఉపాసన తెలిపింది. ఎవరో తెలుసుకుందాం..

ramcharan favourite actor
రామ్​చరణ్​ ఫేవరెట్ యాక్టర్​

By

Published : Sep 20, 2022, 8:21 PM IST

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా 'చిరుత'గా అడుగుపెట్టి.. రెండో సినిమా 'మగధీర'తో టాలీవుడ్‌ రికార్డులన్నింటినీ తిరగరాసి మెగా ధీరుడు అనిపించుకున్నారు హీరో రామ్​చరణ్​. తనదైన నటనా ప్రతిభతో తెలుగు చిత్రసీమలో మెగా మార్క్ చూపించారు. తండ్రి చిరంజీవి లక్షణాలు పుణికి పుచ్చుకున్న హీరోగా టాలీవుడ్‌లో సత్తా చాటారు. తన ప్రయాణంలో కొన్ని పరాజయాలు ఎదురైనా ఏ మాత్రం వెనుకడుగేయకుండా ముందడుగేసి సక్సెస్ రుచి చూశారు. తండ్రికి తగ్గ తనయుడిగా ప్రేక్షకుల మెప్పు పొందుతూ మెగా పవర్ స్టార్‌గా ఎదిగారు. కేవలం నటన మాత్రమే కాకుండా డాన్స్‌ పరంగా కూడా వెండితెరపై చెర్రీ తన మార్క్ చూపించారు. రీసెంట్​గా 'ఆర్​ఆర్​ఆర్'​లో అల్లూరి సీతరామరాజుగా నటించి తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పారు. అలాంటి ఆయనకు ఫేవరెట్ యాక్టర్​ ఎవరో తెలుసా? ఎక్కువగా ఎవరి సినిమాలో చూస్తారో తెలుసా? ఈ విషయాన్ని ఆయన భార్య ఉపాసన తెలిపింది.

'కోలీవుడ్​లో మీ భర్త, మీ ఫేవరెట్​ యాక్టర్​ ఎవర'ని అడగగా.. "నేను రజనీకాంత్​ సినిమాలు చూడటానికి ఎక్కువ ఇష్టపడతాను. అలానే చరణ్​ అజిత్​ మూవీస్​ను చూస్తారు. ఆయనే చెర్రీ ఫేవరెట్ యాక్టర్​" అని ఉపాసన పేర్కొంది.

అజిత్ రజనీకాంత్​

కాగా, రామ్​చరణ్​ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఆర్​సీ 15 సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. కియారా అడ్వాణీ కథానాయిక. పవర్‌ఫుల్‌ కథాంశంతో సోషియో ఫాంటసీ, పొలిటికల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా సిద్ధం కానుంది. ఇందులో చరణ్‌ రెండు విభిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. శ్రీకాంత్‌, అంజలి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ఇదీ చూడండి: 'ఆర్ఆర్ఆర్​'కు నిరాశ.. భారత్ తరఫున 'ఆస్కార్'కు ఎంపికైన చిత్రం ఇదే

ABOUT THE AUTHOR

...view details