Ramcharan Alluarjun : మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్య చాలా కాలం నుంచి కోల్డ్ వార్ జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోందన్న సంగతి తెలిసిందే. దీనిపై రకరకాల కథనాలు కూడా వస్తున్నాయి. అయితే తాజాగా మరోసారి ఈ ప్రచారం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ దీనికి కారణమైంది.
ఇండస్ట్రీలో మెగా-అల్లు కుటుంబాల మధ్య మనస్పర్థలు ఉన్నట్లు ఎప్పుడూ ఏదో ఒక ప్రచారం నడుస్తూనే ఉంటుంది. అదే సమయంలో వాటిని మెగామెంబర్స్ కొట్టి పారేస్తుంటారు కూడా. ఇప్పటికే నాగబాబు, అల్లు అరవింద్ కూడా ఈ విషయమై చాలా సార్లు స్పందించారు. అయితే ఈ మధ్య మెగా - అల్లు వారసులైన చరణ్-అల్లు అర్జున్ మధ్య మనస్పర్థలు అంటూ ప్రచారం ఎక్కువైంది. తాజగా జరిగిన ఓ సంఘటన ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది.
ఏం జరిగిందంటే.. వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి(VarunTej Lavanya Tripathi Wedding) త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ సందర్భంగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో గ్రాండ్‌గా పార్టీ నిర్వహించగా.. తాజాగా అల్లు నివాసంలో నిర్వహించారు. ఈ ఈవెంట్లో చిరంజీవి, అల్లు అరవింద్ కుటుంబసభ్యులతో పాటు నటుడు నితిన్, ఆయన సతీమణి షాలినీ, నటి రీతూవర్మ, పలువురు సన్నిహితులు సందడి చేశారు. కానీ రామ్ చరణ్ మాత్రం కనపడలేదు. అంతకుముందు చిరంజీవి ఇంట్లో పార్టీ నిర్వహించినప్పుడు అల్లు అర్జున్ కూడా ఎక్కడా కనపడలేదు. దీంతో ఈ ఇద్దరి మధ్య నిజంగానే ఏమైనా జరిగిందా అన్న ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది. ట్రోలర్స్‌కు మంచి స్టప్ దొరికేసింది. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని తెగ ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే రామ్‌చరణ్ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' సినిమా చేస్తున్నారు. అల్లు అర్జున్.. 'పుష్ప 2' షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు.
Varun Tej - Lavanya : అల్లు అర్జున్ ఇంట్లో.. వరుణ్-లావణ్య ప్రీ వెడ్డింగ్ గ్రాండ్ పార్టీ