Ramayan Ranbir kapoor : మరో ఎనిమిది రోజుల్లో ప్రభాస్ 'ఆదిపురుష్' వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. రామాయణం ఆధారంగా దీన్ని రూపొందించారు. అయితే ఇప్పుడు మరో రామాయాణం సిల్వర్‌స్క్రీన్‌పైకి వచ్చేందుకు రెడీ అవుతోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్.. బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ, నిర్మాత మధు మంతెనలతో కలిసి రామాయణాన్ని తెరకెక్కించే ప్రయత్నాలను కొన్నేళ్లుగా చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఇప్పుడు మరో వార్త బయటకు వచ్చింది. సినిమాలో ఎవరెవరు నటించనున్నారనే విషయంపై ఓ క్లారిటీ వచ్చేసింది.
రణ్‌బీర్-ఆలియా కలిసి.. ఈ సినిమాలో రాముడి పాత్ర కోసం రణ్‌బీర్ కపూర్‌ను ఓకే చేశారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆ పాత్ర కోసం లుక్ టెస్ట్‌లు కూడా చేసేశారని తెలిసింది. ఇక సీత పాత్ర కోసం నిన్నటి వరకు సాయి పల్లవి పేరు వినిపించింది. కానీ ఇప్పుడు మరో కొత్త పేరు ప్రచారంలోకి వచ్చింది. రణ్‌బీర్ భార్య ఆలియా భట్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం అందింది. తాజాగా దర్శకుడు నితేశ్ తివారీతో అలియా భట్ కలిసి కనిపించింది. దీంతో ఆలియా భట్.. సీత పాత్ర పోషించనుందన్న వార్తలకు మరింత బలం చేకూరింది. ఈమెకు కూడా లుక్ టెస్ట్ చేశారట.
రావణుడిగా అతడే(actor yash new movie).. 'కేజీయఫ్' సిరీస్‌తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ రాకింగ్ స్టార్ యశ్.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. అయితే రావణుడి పాత్ర కోసం మేకర్స్ యశ్‌ను సంప్రదించి చర్చలు జరపుతున్నారని, యశ్ కూడా దాదాపుగా ఓకే చేశారని అని గత కొత్త కాలంగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మళ్లీ అదే వార్త తెరపైకి వచ్చింది. ఇది దాదాపుగా కన్ఫామ్ అయినట్టేనని అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందట.