మాస్ మహారాజా రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా విడుదల తేదీ ఖరారైంది. వరుసగా విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు జులై 29న సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాతో శరత్ మండవ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. వాస్తవానికి 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాను ఏప్రిల్లో విడుదల చేయాలని అనుకున్నారు. కరోనా వల్ల సినిమాను జూన్ 17కు వాయిదా పడింది. ఆ రోజు కూడా రిలీజ్ సాధ్యం కాలేదు. ఈ సినిమాలో రవితేజ రెవెన్యూ ఆఫీసర్గా నటించబోతున్నారు. రవితేజ సరసన దివ్యంశ కౌశిక్, రజియా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' విడుదల తేదీ ఖరారు - ravi teja upcoming movies
రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా విడుదల వాయిదాల పర్వానికి తెరపడింది. ఎట్టకేలకు సినిమా రిలీజ్ తేదీని ప్రకటించింది చిత్రబృందం. ఇంతకీ సినిమా విడుదల ఎప్పుడంటే?
రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' విడుదల తేదీ ఖరారు
Last Updated : Jun 22, 2022, 10:46 PM IST