Ramaiya Vastavaiya Song :బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన 'జవాన్' సినిమా నుంచి తాజాగా ఓ సాంగ్ రిలీజై నెట్టింట సందడి చేస్తోంది. అదే 'రామయ్యా వస్తావయ్యా'. ఈ సాంగ్.. విడుదలైన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ పాటలో తన స్టెప్పులతో కింగ్ ఖాన్ అదరగొట్టగా.. లేడీ సూపర్ స్టార్ నయన్ కూడా స్టన్నింగ్ లుక్స్‌తో ఆకట్టుకుంది. మరో హీరోయిన్ సన్య మల్హోత్రా కూడా ఈ సాంగ్‌లో కనిపించి సందడి చేసింది
Shahrukh Khan Ramaiya Vastavaiya Song :అయితే ఈ పాటలో క్యాచీ లైన్ అయిన 'రామయ్యా వస్తావయ్యా' పై అందరి దృష్టి పడింది. వాస్తవానికి అది ఓ తెలుగు పదం. ఇతర భాషల వారికి ఇది అంతగా తెలియనప్పటికీ.. తెలుగు వాళ్లకు ఈ మాట సుపరిచితమే. అంతే కాకుండా సినిమా టైటిల్స్, సాంగ్స్‌లో ఈ మాటను విరివిగా విన్నాం. అయితే ఈ లైన్‌ను సినీ రంగానికి పరిచయం చేసింది మాత్రం ఓ బాలీవుడ్ వ్యక్తి. ఇంతకీ ఆయన ఎవరంటే..
బాలీవుడ్ స్టార్ హీరో రాజ్ కపూర్. ఆయన లీడ్ రోల్లో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ 'శ్రీ 420'. ఈ సినిమాకు శంకర్, జై కిషన్, శైలేంద్ర, హజ్రత్ జైపురితో కూడిన మ్యూజిక్ టీమ్.. అద్భుతమైన సాంగ్స్‌ను అందించారు. అయితే వీరందరూ అప్పుడప్పుడు ఖండాలాకు పర్యటించేవారు. ఇక మార్గ మధ్యలో వారందరూ ఓ మోటల్(రోడ్ సైడ్ హోటల్) వద్ద ఆగి టీ తాగేవారు. అక్కడ వారికి రామయ్య అనే ఓ తెలుగు వెయిటర్ పరిచయమయ్యారు. అయితే మూవీ టీమ్‌లోని శంకర్.. కొంత కాలం హైదరాబాద్‌లో ఉన్నందున ఆయన మాత్రం రామయ్యతో తెలుగులో మాట్లాడేవారు.