రవితేజ కథానాయకుడిగా శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'రామారావు ఆన్ డ్యూటీ'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జులై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సమయంలో చిత్ర బృందానికి ఊహించని షాక్ ఎదురైంది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు సోషల్‌మీడియాలో లీకయ్యాయి. రవితేజ సంభాషణలతో కూడిన ఆ సన్నివేశాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీనిపై చిత్ర బృందం ఒక్కసారిగా కంగుతింది. ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఎడిటింగ్ రూమ్ నుంచి రామారావు చిత్ర సన్నివేశాలు లీకైనట్లు చిత్ర బృందం అనుమానం వ్యక్తం చేస్తోంది. లీకైన సన్నివేశంలో అధికార పార్టీపై విరుచుకుపడుతూ పరోక్షంగా రవితేజ చేసిన సంభాషణలు ట్రెండ్ అవుతున్నాయి.
రవితేజకు షాక్.. 'రామారావు ఆన్ డ్యూటీ' సీన్స్ లీక్! - రామారావ్ ఆన్ డ్యూటీ
'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రబృందానికి ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం విడుదల కావాల్సిన ఈ మూవీకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు సోషల్‌మీడియాలో లీకయ్యాయి. ఎడిటింగ్ రూమ్ నుంచే ఇవి లీక్ అయినట్లు చిత్ర బృందం అనుమానం వ్యక్తం చేస్తోంది.
రామారావు
శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. రవితేజకు జోడీగా దివ్యాంశ కౌశిక్ నటిస్తున్నారు. రజీష విజయన్, వేణు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. ఇంతకు ముందెన్నడూ చూడని రీతిలో రవితేజను శరత్ మండవ ఈ సినిమాలో చూపించారు. రవితేజ ఇందులో ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నారు.
ఇదీ చూడండి:రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న ప్రియాంక-నిక్ దంపతులు!
Last Updated : Jul 28, 2022, 3:57 PM IST