తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రామ్​ 'బుల్లెట్'​ సాంగ్​ రిలీజ్​..​ సూపర్​ గర్ల్​ మేకింగ్​ వీడియో అదుర్స్​ - రామ్​ బుల్లెట్​ సాంగ్​

రామ్​ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం 'ది వారియర్'​. ఈ సినిమా నుంచి కోలీవుడ్​ హీరో శింబు పాడిన బుల్లెట్​ లిరికల్​ సాంగ్​ను చిత్రబృందం శుక్రవారం రిలీజ్​ చేసింది. మరోవైపు, తొలి ఇండియన్​ సూపర్​ గర్ల్​ మూవీ 'ఇంద్రాణి' మేకింగ్​ వీడియోను విడుదల చేశారు మేకర్స్​.

cinema updates
cinema updates

By

Published : Apr 22, 2022, 6:17 PM IST

Ram The Warrior Bullet Song Release: యువ కథానాయకుడు రామ్‌ పోతినేని కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం 'ది వారియర్‌'. యాక్షన్‌ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి కోలీవుడ్​ హీరో శింబు పాడిన 'బుల్లెట్' లిరికల్ వీడియో సాంగ్​​ను మేకర్స్​ శుక్రవారం రిలీజ్​ చేశారు. ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రంలో.. నదియా, భారతీరాజా ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. జులై 14వ తేదీన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలో భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాను తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి తెరకెక్కిస్తున్నారు. శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.

Super Girl Movie Making Video: హాలీవుడ్​లోనే సూపర్​ హీరోస్​,​ హీరోయిన్స్​ చిత్రాలను ఎక్కువగా చూస్తుంటాం. భారత చిత్రసీమలోనూ 'క్రిష్​' సిరీస్​ తర్వాత సూపర్​ హీరోస్​ చిత్రాలను తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్​.​ అయితే సూపర్​ హీరోయిన్ల​ చిత్రాలు ఎప్పుడూ రాలేదు. ఇప్పుడా ఆ లోటు భర్తీ కాబోతుంది. విభిన్నమైన కథాంశంతో 'ఇంద్రాణి' అనే తొలి ఇండియన్​ సూపర్​ గర్ల్​ సినిమా తెరకెక్కుతోంది.

కొద్ది రోజుల క్రితం షూటింగ్​​ ప్రారంభమైన ఈ మూవీకి యాక్షన్​ సన్నివేశాలతో పాటు కమర్షియల్​ హంగులు జోడించనున్నారు. ఇక, సూపర్​గర్ల్​ 'ఇంద్రాణి' సినిమా మేకింగ్​ వీడియోను మేకర్స్​ రిలీజ్​ చేశారు. ఈ చిత్రంతో స్టీఫెన్​ దర్శకుడిగా పరిచయం కానున్నారు. చోటాకే ప్రసాద్​ ఎడిటింగ్​ బాధ్యతలు తీసుకున్నారు. సాయికార్తీక్​ సంగీతం అందించనున్నారు. యానియా భరద్వాజ్​, కబీర్​ ధుహాన్​ సింగ్​ సహా తదితురులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Keerthi Suresh Movie Chinni In OTT: 'మహానటి' సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్​ కీర్తి సురేష్‌. తెలుగు, తమిళ భాషల్లో విభిన్న చిత్రాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటోంది. ఓవైపు భారీ స్థాయి సినిమాలు చేస్తూనే.. మరోవైపు లేడీ ఓరియంటెడ్‌ చిత్రాల్లో అలరిస్తోంది. అలా కీర్తి ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం 'సాని కాయిదం'. ఈ సినిమా తెలుగులో 'చిన్ని' పేరుతో అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ట్రైలర్‌ను బట్టి చూస్తే కీర్తి సురేష్‌ ఈ సినిమాలో డీ గ్లామరస్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

క్రైమ్‌ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో సెల్వ రాఘవన్‌ ప్రధాన ప్రాత్రలో కనిపించనున్నారు. అరుణ్‌ మతేశ్వరన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 6 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. హీరో ధనుష్‌ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో 'ప్రతీకారం తీర్చుకోవడమంటే ఏంటి' అంటూ కీర్తి తన నటనతో ఆకట్టుకుంది.

ఇవీ చదవండి:'మంచితనాన్ని చేతకానితనం అనుకోవద్దు'.. వారికి సమంత వార్నింగ్​

సర్కారు వారి 'టైటిల్'​ సాంగ్ అప్డేట్​​.. 'కేజీఎఫ్-​2'పై బన్నీ కామెంట్స్

ABOUT THE AUTHOR

...view details