తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'బిగ్​ బీ'కి ప్రాజెక్ట్-కే టీమ్ సర్​ప్రైజ్.. బాలయ్య 107వ చిత్రం అప్డేట్! - బాలకృష్ణ అప్​కమింగ్​ ప్రాజెక్ట్

ప్రాజెక్ట్-కే నుంచి అదిరే అప్డేట్ వచ్చేసింది. బిగ్​బీ పుట్టినరోజు సందర్భంగా ఈ మేరకు సర్​ప్రైజ్ అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. మరోవైపు, బాలీవుడ్​ నటుడు అక్షయ్‌కుమార్‌ ప్రధాన పాత్రలో దర్శకుడు అభిషేక్‌ శర్మ తెరకెక్కించిన చిత్రం 'రామ్‌ సేతు' ట్రైలర్​ రిలీజ్​ అయ్యింది. 'బింబిసార' తర్వాత కళ్యాణ్​ రామ్​ మరో మూవీతో రాబోతున్నాడు.

ram setu trailer
telugu and hindi movies latest updates

By

Published : Oct 11, 2022, 5:57 PM IST

బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు సందర్భంగా ప్రాజెక్ట్-కే బృందం సర్​ప్రైజ్ అప్డేట్ ఇచ్చింది. ఐదు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో ఎదురులేకుండా దూసుకెళ్తున్న పవర్​హౌస్​కు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా ప్రాజెక్ట్-లో అమితాబ్ లుక్​ను విడుదల చేసింది. చెయ్యికి బ్యాండేజీ కట్టుకొని పిడికిలి బిగించినట్లు ఉన్న చిత్రాన్ని పోస్ట్ చేసింది. లెజెండ్స్​ ఎప్పటికీ అమరులుగానే ఉండిపోతారని పోస్టర్​పై రాసుకొచ్చింది. ఇది అభిమానులను ఆకట్టుకుంటోంది.

బాలీవుడ్​ నటుడు అక్షయ్‌కుమార్‌ ప్రధాన పాత్రలో దర్శకుడు అభిషేక్‌ శర్మ తెరకెక్కించిన చిత్రం 'రామ్‌ సేతు'. సత్యదేవ్‌ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, నుస్రత్‌ బరూచా కథానాయికలు. దీపావళి కానుకగా ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం మంగళవారం ట్రైలర్‌ను విడుదల చేసింది.

'ఈ దేశం శ్రీరాముడిపై నమ్మకంతో నడుస్తుంది' అంటూ నటుడు నాజర్‌ పరిచయ సన్నివేశంతో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఇతిహాసాల్లోని నిజాన్ని వెలికితీసే వ్యక్తిగా అక్షయ్‌ కనిపించిన తీరు ఆకట్టుకునేలా ఉంది. 7000 ఏళ్ల క్రితంనాటి సంగతులు తెలుసుకునే క్రమంలో అక్షయ్‌, సత్యదేవ్‌ చేసిన సాహసం, విలన్ల గ్యాంగ్‌తో పోరాటం.. ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. రామసేతు వారధి రహస్యాల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందినట్టు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది.

బింబిసార తర్వాత మరో చిత్రంలో కళ్యాణ్​ రామ్​..
బ్లాక్​బస్టర్​ 'బింబిసార' తర్వాత కళ్యాణ్​ రామ్​ మరో మూవీతో రాబోతున్నాడు.'ఎన్​కేఆర్19'గా సెట్స్​లోకి అడుగుపెట్టిన ఈ సినిమా లాస్ట్​ షెడ్యూల్​లో బిజీ బిజీగా ఉంది. తాజాగా గోవాలో ఓ షెడ్యూల్ ముగించుకున్న ఈ సినిమా ప్రస్తుతం లాస్ట్​ షూట్​ను ప్రారంభించనుంది. మైత్రీ మూవీస్​ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించారు. ​నవంబర్​ 4న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్​ కానుంది.

బాలకృష్ణ అప్​కమింగ్​ ప్రాజెక్ట్​..
నటసింహం బాలకృష్ణ వరుస ప్రాజెక్టులతో ప్రేక్షకులను ఊర్రూతలూగించడానికి రెడీ అయ్యాడు. ఇదివరకే అఖండతో ఘన విజయం సొంతం చేసుకున్న బాలయ్య.. మరో క్రేజీ ప్రాజెక్టు ఎన్​బీకే 107తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే ఈ సినిమాకు ఇంకా పేరు ఖరారు కాలేదు. వచ్చే శుక్రవారం పేరును ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:తెలుగు సినిమాలకు నిర్మాతగా ధోని.. ఆ స్టార్​ హీరోయిన్​తో ఎంట్రీ..!

బాలీవుడ్‌లోకి స్టార్ క్రికెటర్​ ఎంట్రీ.. ఆ సినిమాతోనే

ABOUT THE AUTHOR

...view details