తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఓరి దేవుడా, ఆపండ్రా బాబు.. నేనేం చేసుకోవట్లే: హీరో రామ్​ - రామ్​ పోతినేని దివారియర్​

Ram potineni Marriage: టాలీవుడ్ కథానాయకుడు రామ్​ పోతినేని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారని ప్రచారం సాగుతోంది. తాజాగా దీనిపై స్పందించారాయన. ఏమన్నారంటే..

Ram potineni Marriage
రామ్​ పోతినేని పెళ్లి

By

Published : Jun 29, 2022, 5:15 PM IST

Ram potineni Marriage: టాలీవుడ్​ బ్యాచిలర్స్​రో ఒకరైన హీరో రామ్​పోతినేని.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఇటీవలే జోరుగా ప్రచారం సాగింది. సోషల్​మీడియాలో ఎక్కడ చూసినా ఈయన పెళ్లి గురించే వార్తలు ట్రెండ్ అయ్యాయి. తన చిన్ననాటి స్నేహితురాలు, స్కూల్​మేట్​ను వివాహం చేసుకోనున్నట్లు కథనాలు వచ్చాయి. కొంతకాలం నుంచి వీరు ప్రేమలో ఉన్నారని, వివాహ బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారంటూ అంతా మాట్లాడుకున్నారు.

అయితే తాజాగా ఈ రూమర్స్​పై స్పందించారు హీరో రామ్​. "ఓరి దేవుడా, ఇక చాలు దయచేసి ఆపండి. నేను రహస్యంగా ఏ​ హై స్కూల్​ ఫ్రెండ్​ను పెళ్లి చేసుకోవట్లేదు. దీనిపై సన్నిహితులు, కటుంబసభ్యులకు కూడా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజం చెప్పాలంటే.. హై స్కూల్​కు నేనెప్పుడు సరిగ్గా వెళ్లలేదు" అంటూ రామ్​ పేర్కొన్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. 'ఇస్మార్ట్​ శంకర్'​తో సూపర్​ సక్సెస్​ను అందుకున్న రామ్​.. ఆ తర్వాత నుంచి దూకుడు కొనసాగిస్తున్నారు. లింగుస్వామి దర్శకత్వంలో ఆయన నటించిన 'ది వారియర్'​ త్వరలోనే విడుదల కానుంది. మరోవైపు ఆయన ఊరమాస్​ డైరెక్టర్​ బోయపాటితో ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవలే షూటింగ్ ప్రారంభించుకుందీ చిత్రం.


ఇదీ చూడండి: త్వరలోనే రామ్​ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?

ABOUT THE AUTHOR

...view details