అభిమానులు, ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా, ఎప్పటికప్పుడు తన ఆహార్యాన్ని మార్చుకుంటూ, విభిన్నపాత్రలతో మెప్పించే ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని. ఇస్మార్ట్ శంకర్, రెడ్ వంటి హిట్ సినిమాలతో మాస్ కథల జోనర్పై ఫోకస్ పెట్టారు. అలా ఆయన చివరిగా దర్శకుడు లింగుస్వామితో చేసిన వారియర్ సినిమా భారీ డిజాస్టర్‌గా నిలిచింది. అయినా ఆయన మళ్లీ మాస్ జోనర్పైనే దృష్టి పెట్టి డైరెక్టర్ బోయపాటితో చేతులు కలిపారు. ఈ సారి ఎలాగైనా సరైనా హిట్ కొట్టాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. తన ఆశలన్నీ ఈ చిత్రంపైనే పెట్టుకున్నారు. ఇక బోయపాటి అంటే కూడా భారీ యాక్షన్ కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన అఖండ లాంటి బ్లాక్ బస్టర్ అందుకోవడంతో రామ్‌తో చేయబోయే సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోందీ చిత్రం. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ చిత్రంలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతుండట. ఏకంగా 300 మందితో స్పెషల్ యాక్షన్ సీన్‌ను రూపొందిస్తున్నారట. వారందరితో రామ్ తలపడేలా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఈ సన్నివేశం సినిమా మొత్తానికి హైలైట్‌గా ఉండనుందట. పవర్ ఫుల్‌గా దీన్ని చిత్రీకరించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇంకా ఈ సినిమా కథ విషయానికొస్తే ఓ కొత్త ప్రచారం వినిపిస్తోంది. ఈ మూవీ పొలిటికల్ టచ్ కాన్సెప్ట్‌తో రూపొందుతోందని తెలుస్తోంది. ఈ చిత్రంలోని సీఎం పాత్రే ప్రతినాయకుడిగా కనిపిస్తారని సమాచారం.
300మందితో రామ్ పోతినేని ఫైట్.. ఈ సారి చరణ్ లేకుండానే RC 15 - ఆర్ సీ 15 కొత్త షెడ్యూల్
స్టైలిష్‌గా కనిపిస్తూనే మాస్ పాత్రలతో అలరించే కథానాయకుడు రామ్. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసింది. తాజాగా ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఏకంగా 300మందితో రామ్‌పై ఫైటింగ్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారని తెలిసింది. అలాగే రామ్‌చరణ్ 'ఆర్సీ 15' సినిమా అప్డేట్ కూడా ఒకటి బయటకు వచ్చింది. ఆ వివరాలు..
ఆర్సీ 15 షూటింగ్ అప్డేట్.. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ దక్కించుకున్న మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'ఆర్ సీ 15' చేస్తున్నారు. పాన్ ఇండియన్ స్థాయిలో భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ అప్డేట్స్ బయటకు వచ్చాయి. కొత్త షెడ్యూల్ హైదరాబాద్, రాజమండ్రి నగరాల్లో జరగనుందని తెలుస్తోంది. ఫిబ్రవరి తొలి వారంలో చిత్రీకరణ జరగనున్నట్లు సమాచారం. ఇందులో చరణ్ లేకుండా ప్రధాన పాత్రలపై దర్శకుడు శంకర్ కీలక సన్నివేశాలను షూట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఐఏఎస్ ఆఫీసర్‌గా, అవినీతిని ఎదురించే పోరాట యోధుడిగా కనిపించనున్నారు. కియారా అద్వాణీ, అంజలి హీరోయిన్స్. ఎస్‌జే సూర్య విలన్. పూర్తి పొలిటికల్ టచ్‌లో ఈ సినిమాలు నవీన్‌చంద్ర, సునీల్, అంజలి కీలక పాత్రలను పోషించనున్నారు. పిజ్జా, పేట, పెంగ్విన్, మహాన్ వంటి చిత్రాలు తెరకెక్కించిన ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ ఈ చిత్రానికి కథ అందించారు. తమన్ స్వరాలు సమకూర్చారు.
ఇదీ చూడండి:నెం.1,2గా 'జై భీమ్', 'జనగణ మన'.. టాప్ 10 కోర్టురూమ్ డ్రామా మూవీస్ ఇవే