తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బోయపాటి-రామ్​ టైటిల్​ గ్లింప్స్​ వచ్చేసింది.. గూస్​బంప్సే! - స్కంద టైటిల్ గ్లింప్స్​ రిలీజ్

Ram pothineni Boyapati movie Title : బోయపాటి శ్రీను -రామ్​ పోతినేని సినిమా టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది. గూస్​బంప్స్​ తెప్పిస్తోంది. మీరు చూశారా.. లేదంటే ఇక్కడ ఓ లుక్కేయండి..

Boyapati Ram potineni
'స్కంద'గా బోయపాటి-రామ్​.. గూస్​బంప్స్​ తెప్పిస్తున్న టైటిల్​ గ్లింప్స్​!

By

Published : Jul 3, 2023, 11:59 AM IST

Updated : Jul 3, 2023, 12:52 PM IST

Ram pothineni Boyapati movie Title : అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బోయపాటి శ్రీను -రామ్​ పోతినేని సినిమా టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది. ఈ ప్రచార చిత్రంలో రామ్ పవర్​ ఫుల్ అండ్​ మాసీ లుక్​ అదిరిపోయింది. 'మీరు దిగితే ఊరు ఏదైతే ఉండదో నేను దిగితే మిగిలేది ఉండదు' అంటూ రామ్.. విలన్లపై విరుచుకుపడేందుకు వెళ్తుంటే గూస్ బంప్స్​ వస్తున్నాయి. ముఖ్యంగా తమన్ అందించిన బ్యాక్​ గ్రౌండ్​ మ్యూజిక్​తో మరోసారి థియేటర్లు దద్దరిల్లడం ఖాయం అనిపిస్తోంది. మొత్తంగా ఈ గ్లింప్స్​ బోయపాటి మార్క్- రామ్ ఎనర్జీకి తగినట్టుగా ఉంది.

ఇకపోతే ఇప్పటికే రిలీజైన ఈ చిత్ర టీజర్​ కూడా ఫ్యాన్స్​ను బాగా ఆకట్టుకుంది. మాస్ బ్యాక్​ గ్రౌండ్​ మ్యూజిక్​తో ఈ ప్రచార చిత్రంలో రామ్ చెప్పిన డైలాగ్.. సూపర్​ రెస్పాన్స్‌ను అందుకుంది. 'నీ స్టేట్ దాటలేనన్నావ్ దాటా.. నీ గేట్ దాటలేనన్నావ్ దాటా.. నీ పవర్ దాట లేనన్నావ్ దాటా'.. అంటూ ఆయన భారీగా డైలాగ్​ చెప్పి ఆకట్టుకున్నారు. మొత్తంగా ఇప్పటివరకు రిలీజైన పోస్టర్స్, ప్రచార చిత్రాలు చూస్తుంటే.. ఈ సినిమాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు మాస్​ యాక్షన్ ఎక్కువగా ఉండబోతుండనేది అర్థమవుతోంది.

Ram pothineni boyapati movie cast : ఇకపోతే ఈ చిత్రంలో యంగ్​ బ్యూటీ హీరోయిన్​ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. తమ్మిరాజు ఎడిటిర్​గా వ్యవహరిస్తున్నారు. సంతోష్ డిటాకే కెమెరామెన్​గా పని చేస్తున్నారు. సెప్టెంబర్ 15వ తేదీన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై సినిమా రూపొందుతోంది. భారీ బడ్జెట్​తో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. భారీ నిర్మాణ విలువలు, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

Ram pothineni puri jagannadh movie : ఈ చిత్రం అవ్వగానే రామ్ పోతినేని.. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్​తో మరో సినిమా చేయనున్నారు. 2019లో విడుదలైన ఇస్మార్ట్ శంకర్​ సినిమాకు సీక్వెల్​ చేస్తున్నారు. పూరి కనెక్ట్స్‌ పతాకంపై పూరి జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ చిత్రం మొదటి భాగం రూ.16 కోట్ల బడ్జెట్​తో రూపొందగా.. బాక్సాఫీస్​ వద్ద రూ.80 కోట్ల వరకు వసూళ్లను సాధించి సెన్సేషన్​ క్రియేట్​ చేసింది. అప్పటి వరకు లవర్​ బాయ్​గా అమ్మాయిల మనసులు దోచుకున్న రామ్​.. ఈ సినిమాతో ఊర మాస్​ అవతారమెత్తి అభిమానుల్ని ఆశ్చర్యపరిచాడు.

ఇదీ చూడండి :

రామ్-బోయపాటి మూవీ.. ఫస్ట్ థండర్​ బ్లాస్ట్​.. యాక్షన్​ వేరే లెవెల్​!

ఇట్స్​ అఫీషియల్.. నాలుగేళ్ల తర్వాత రానున్న 'ఇస్మార్ట్'​ కాంబో!

Last Updated : Jul 3, 2023, 12:52 PM IST

ABOUT THE AUTHOR

...view details