తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

విజిల్ సాంగ్​లో రామ్ మాస్ డ్యాన్స్​.. 'పక్కా కమర్షియల్' ప్రీ రిలీజ్​కు మెగాస్టార్! - pakka commercial pre release event

రామ్ పోతినేని హీరోగా నటించిన 'ది వారియర్' సినిమా నుంచి 'విజిల్' సాంగ్​ విడుదలై మాస్​ స్టెప్పులతో అదరగొడుతోంది. అలాగే 'పక్కా కమర్షియల్' ప్రీ రిలీజ్ ఈవెంట్​కు సంబంధించిన కీలక అప్డేట్​ మీకోసం..

Ram Mass Dance in Whistle Song .. Megastar  chiraneevi to attend'Pakka Commercial' Pre Release!
విజిల్ సాంగ్​లో రామ్ మాస్ డ్యాన్స్​.. 'పక్కా కమర్షియల్' ప్రీ రిలీజ్​కు మెగాస్టార్!

By

Published : Jun 22, 2022, 10:50 PM IST

Updated : Jun 22, 2022, 10:57 PM IST

రామ్ పోతినేని హీరోగా, కృతి శెట్టి హీరోయిన్​గా నటించిన సినిమా 'ది వారియర్'. తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని 2022 జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు నిర్మాత. తాజాగా ఈ సినిమాలోని విజిల్​ సాంగ్​ను రిలీజ్​ చేశారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సోషల్ మీడియా వేదికగా విజిల్ పాటను ఆవిష్కరించి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. 'నాలికిట్టా మడతపెట్టి.. వేళ్లు రెండు జంట కట్టి.. ఊదు మరి దమ్మే బట్టి.. విజిల్.. విజిల్.. విజిల్' అంటూ సాగిన ఈ సాంగ్ మాస్ ని విపరీతంగా అలరిస్తోంది. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రామ్ కనిపించనున్నారు. అక్షర గౌడ ఒక ముఖ్యమైన పాత్రలో నటించగా.. ఆది పినిశెట్టి పవర్ ఫుల్ విలన్ రోల్ ప్లే చేసాడు. నదియా - నాజర్ - భారతీరాజా - చిరాగ్ - రెడిన్ ఇతర కీలక పాత్రలు పోషించారు.

గోపీచంద్ - రాశి ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'పక్కా కమర్షియల్'. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2- యూవీ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. వచ్చేనెల 1వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 26న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్​కు ముఖ్య అతిథిగా మెగాస్టార్​ చిరంజీవి రానున్నట్లు సమాచారం. దీంతో ఈ సినిమాపై మరింత హైప్​ క్రియోట్​ అయ్యింది. జేక్స్ బిజోయ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు.

ఇదీ చదవండి:సల్మాన్​ సరసన 10మంది టాప్ హీరోయిన్లు.. సమంత, రష్మిక ఇంకా..!

Last Updated : Jun 22, 2022, 10:57 PM IST

ABOUT THE AUTHOR

...view details