బంగారు గనుల నేపథ్యంలో రూపుదిద్దుకున్న పవర్‌ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కేజీఎఫ్’. యశ్-ప్రశాంత్‌నీల్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపుదిద్దుకున్న ‘కేజీఎఫ్-2’ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్‌హిట్ టాక్ సొంతం చేసుకొంది. మథర్ సెంటిమెంట్, హీరో ఎలివేషన్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు.. ‘కేజీఎఫ్-2’లో ఎన్నో అంశాలు ప్రేక్షకుల్ని ఆకర్షించేలా ఉన్నాయని సినీ ప్రియులు సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ‘కేజీఎఫ్-2’ ఓపెనింగ్ కలెక్షన్స్‌పై తాజాగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. ఈ క్రమంలో ఆయన బాలీవుడ్‌ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు.
'కేజీఎఫ్-2' హిట్ టాక్- బాలీవుడ్‌పై ఆర్జీవీ హాట్ కామెంట్స్ - kgf chapter 2 release
బాలీవుడ్‌లో దక్షిణాది చిత్రాల హవా కొనసాగుతున్న నేపథ్యంలో హిందీ చిత్ర పరిశ్రమపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఈ సందర్భంగా అక్కడి మార్కెట్లో భారీ స్థాయిలో ఓపెనింగ్ సాధించిన చిత్రాల జాబితాను ట్విట్టర్ ద్వారా బయటపెట్టారు.
బాలీవుడ్‌లో భారీ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రాల జాబితా ఫొటోని షేర్ చేస్తూ.. "బాలీవుడ్ మార్కెట్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో కన్నడ చిత్రమైన 'కేజీఎఫ్-2', తెలుగు చిత్రమైన 'బాహుబలి-2' తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. దీనిపై బాలీవుడ్ ఏం ఆలోచిస్తుందని మీరు భావిస్తున్నారు" అని వర్మ ట్వీట్ చేశారు. వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు అంతటా వైరల్‌గా మారింది. మరోవైపు దక్షిణాది చిత్రాలకు ఇప్పుడు నార్త్‌లోనూ మంచి మార్కెట్ లభిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో చాలా వరకూ తెలుగు చిత్రాలు హిందీలోనూ విడుదల అవుతున్నాయి.
ఇదీ చదవండి: మరిన్ని దేశాల్లో 'ఆర్ఆర్ఆర్' రిలీజ్- 'సలార్' గ్లింప్స్ వైరల్!