Ram charan fashion : 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఎవరూ ఊహించని రేంజ్‌కు ఎదిగారు. మెగా పవర్ స్టార్‌గా ఉన్న ఆయన ఒక్క సారిగా గ్లోబల్ స్టార్ రేంజ్‌కి ఎదిగిపోయారు. అందుకే ఇప్పుడు ఆయన ఏం మాట్లాడినా.. ఏం చేసినా అది సెన్సేషనల్ అవుతోంది. ఇక రీసెంట్గా ఆయన తండ్రిగా ప్రమోషన్ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి.
సాధారణంగా ఎవరైనా దేశ వ్యాప్తంగా ఉన్న హీరోల్లో ఎవరి ఫ్యాషన్ సెన్స్ నచ్చుతుందని అని అడిగితే.. వారు టక్కున చెప్పే పేర్లల్లో రణ్వీర్ సింగ్, షారుక్ ఖాన్, హృతిక్ రోషన్ ఉంటారు. అభిమానులు మాత్రమే కాదు ఇతర స్టార్ హీరోలు, యాక్టర్స్ కూడా దాదాపుగా వీరి పేర్లే ఎక్కువగా ప్రస్తావిస్తుంటారు. అప్పట్లో ప్రభాస్ కూడా హృతిక్ రోషన్ యాక్టింగ్, స్టైల్ నచ్చుతుందని చెప్పారు. అయితే ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్.. మాత్రం ఎవరూ ఊహించని పేరు చెప్పి అందరిని సర్ప్రైజ్ చేశారు.
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ఈ ప్రశ్నకు చెర్రీ.. బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ పేరును ప్రస్తావించారు. ఆయన ఫ్యాషన్స్ సెన్స్, స్టైల్ తనకెంతో ఇష్టమని చెర్రీ తెలిపారు. "ఓ రాజు కుటుంబంలో ఉండే ఠీవి, తేజస్సు సైఫ్‌లో కనపడుతుంది. ఆర్గానిక్‌గా కనిపిస్తారు. ఎక్కువగా హడావిడి చేసుందుకు ఆయన ప్రయత్నించరు. సింపుల్‌గా ఉంటారు." అని చరణ్ తెలిపారు.