మెగా కుటుంబంలో చాలా రోజుల తర్వాత సంతోషం వెల్లివిరిసింది. రామ్చరణ్-ఉపాసన దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇదివరకే ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇక, ఉపాసన అనేక విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటుంటారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫొటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
మెగా ఇంట సందడి.. ఉపాసనకు సీమంతం! - ఉపాసన రామ్చరణ్
మెగా కోడలు ఉపాసన తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన ఓ ఫొటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆ ఫొటోకు బెబీ కమింగ్ సూన్ అంటూ ఎమోజీని కూడా జతచేశారు. దీంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఉపాసన స్నేహితురాలు ఒకరు.. ఆమెకు చిన్నపాటి సీమంతం చేశారు. అనంతరం ఆ దంపతులకు గిఫ్ట్స్ ఇచ్చారు. ఈ ఫొటోలను ఉపాసన తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. బేబీ లోడింగ్ అని అర్థం వచ్చేలా.. దాని కింద 'కమింగ్ సూన్' అని ఉన్న ఎమోజీని పోస్ట్ చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇటీవలే ఉపాసన చేసిన మరో పోస్ట్ కూడా వైరల్ అయింది. ప్రముఖ అధ్యాత్మిక గురువు, ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్, ఆయన కుమార్తె రాధ జగ్గీతో దిగిన ఫొటోను షేర్ చేశారు. దానికి కింద రాసిన క్యాప్షన్ అందరినీ ఆకట్టుకుంది. అందులో "ఇద్దరు కుమార్తెలతో సద్గురు. ఒకరు సొంత కుమార్తె. మరొకరు దత్త పుత్రిక" అని రాసుకొచ్చారు. కాగా, ఉపాసన తాత, అపోలో ఆస్పత్రుల వ్యవస్థాపకులు ప్రతాప్ రెడ్డి పుట్టినరోజు వేడుకలకు.. సద్గురు ఆయన కుమార్తె హాజరయ్యారు.