మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన కామినేని కొణిదెల త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వనున్న సంగతి తెలిసిందే. అయితే ఉపాసన డెలివరీ ఎక్కడ జరుగుతుంది? స్వదేశంలోనా లేదా విదేశాల్లోనా అనే ఆలోచన చాలా మంది అభిమానుల మదిలో మెదులుతోంది. ఇటీవల ఓ అమెరికన్ టీవీ టాక్ షోలో రామ్ చరణ్ సందడి చేయగా.. అక్కడ జరిగిన సంభాషణ ఆధారంగా అమెరికాలో ఉపాసన డెలివరీకి ప్లాన్ చేస్తునట్లు చాలా మంది సోషల్‌మీడియాలో ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు అది నిజం కాదని తెలిసింది. తాజాగా ఉపాసనే స్వయంగా సోషల్‌మీడియా వేదికగా డాక్టర్లు, డెలీవరి వివరాలను తెలిపింది. భారత్‌లోనే డెలివరీ చేయించుకుంటానని, అది కూడా అపోలో హాస్పిటల్‌లోనే జరుగుతుందని ఉపసాన చెప్పుకొచ్చింది. డాక్టర్స్ సుమన మనోహర్, రూమా సిన్హాలు ఆపరేషన్ చేస్తారని తెలిపింది. డా.జెన్నిఫర్ ఆస్టన్ను.. 'మీరు కూడా రావొచ్చుగా' అంటూ మరో అంతర్జాతీయ డాక్టర్‌కు ఉపాసన విజ్ఞప్తి చేసింది. దీంతో ఆ డాక్టర్ కూడా తాను వస్తానని చెప్పుకొచ్చింది.
ఇదీ జరిగింది... ఇకపోతే రీసెంట్గా 'గుడ్ మార్నింగ్ అమెరికా' టాక్ షోలో చరణ్ పాల్గొని.. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో పాటు తన పర్సనల్ లైఫ్ గురించి కూడా మాట్లాడారు. త్వరలోనే ఆయన తండ్రి కాబోతున్న ప్రస్తావన కూడా అక్కడ వచ్చింది. అయితే ఈ షోకు.. అమెరికాలోని ప్రముఖ గైనకాలజిస్ట్ జెన్నిఫర్ ఆస్టన్ హోస్ట్‌గా వ్యవహరించారు. అప్పుడు చరణ్.. ఆమెను కలవడం సంతోషంగా ఉందని చెబుతూ.. ఆమె ఫోన్ నంబర్ తీసుకుంటానని చెప్పారు. తన భార్య ఉపాసన అమెరికా వస్తుందని.. డెలివరీకి ఆస్టన్ అందుబాటులో ఉంటే బాగుంటుందని అన్నారు. అందుకు జెన్నిఫర్ కూడా ఒకే చెప్పారు. 'మీతో జర్నీ చేయడానికి నేను రెడీ. మీ ఫస్ట్ బేబీని డెలివరీ చేయడం నాకు గౌరవం' అంటూ ఆమె బదులిచ్చారు.