తెలంగాణ

telangana

మొన్న దుబాయ్​.. నేడు మాల్దీవులు.. గ్యాప్​ లేకుండా చెర్రీ-ఉప్సీ ఫారిన్​ టూర్స్​!

By

Published : Apr 8, 2023, 6:32 PM IST

మెగా పవర్​ స్టార్ రామ్​చరణ్​, ఉపాసన దంపతులు వెకేషన్​ను​ ఎంజాయ్​ చేస్తున్నారు. తాజాగా మల్దీవులకు ప్రయాణమవుతూ.. ఎయిర్​పోర్టులో కనిపించారు. స్టైలిష్​గా ఉన్న వీరి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్​ అవుతున్నాయి.

ram charan upasana holidays
ram charan upasana holidays

మెగా పవర్​ స్టార్ రామ్‌చరణ్‌, ఉపాసన త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. పెళ్లైన 11 ఏళ్లకు శుభవార్త చెప్పారు ఈ దంపతులు. వారసుడు రాబోతోన్నాడని మెగా కుటుంబం తెగ ఆనందపడుతోంది. రామ్​చరణ్‌, ఉపాసన దంపతులు కూడా సంబరాల్లో మునిగిపోయారు. దీంతో పుట్టబోయే బిడ్డ కోసం మెగా ఫ్యామిలీ సహా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవల దుబాయ్‌లో ఉపాసన సీమంతం వేడుకలను ఘనంగా జరిపించిన చెర్రీ.. ప్రస్తుతం ఉపాసన పక్కనే ఉంటూ ఆమె కోరికలు తీర్చుతున్నారు! అందుకే ఇప్పుడు ఉపాసనను.. చరణ్​ దేశ విదేశాలు తిప్పుతున్నట్టు కనిపిస్తోంది. ఈ మేరకు ఎయిర్​పోర్ట్​లో రామ్​చరణ్​, ఉపాసన కొత్త లుక్​లో కనిపించారు.

దుబాయ్​లో జరిగిన సీమంతంలో రామ్ చరణ్‌, ఉపాసన తెల్ల రంగు దుస్తుల్లో మెరిశారు. దీంతో మోస్ట్ రొమాంటిక్ జోడీ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేశారు. అంతే కాకుండా దుబాయ్ వెకేషన్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ జంట మళ్లీ మాల్దీవులకు వెళ్లారు. ఈ మేరకు ఎయిర్​పోర్ట్​లో రామ్​చరణ్‌, ఉపాసన కనిపించారు.

ఉపాసనకు ఆలియా భట్​ స్పెషల్​ గిఫ్ట్..
త్వరలో తల్లి కాబోతున్న ఉపాసనకు ఇటీవల బాలీవుడ్​ ప్రముఖ నటి ఆలియా భట్​ ఒక గిఫ్ట్​ను పంపించింది. ఈ విషయాన్ని ఉపాసన సోషల్​ మీడియా వేదికగా పంచుకుంది. ఆలియా పంపిన దుస్తుల ఫొటో షేర్​ చేసి.. 'నాకు ఈ సమయంలో ఏది అవసరమో అదే.. థ్యాంక్యూ ఆలియా భట్, ఈద్​ ఏ మమ్మ' అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్​ను స్క్రీన్​ షాట్​ తీసి.. ఆలియా భట్​ ఇన్​స్టాలో పంచుకుంది. దానికి లవ్​ సింబల్​ జోడించింది. కాగా, ఆలియా భట్​ ఈద్​-ఏ-మమ్మ(Ed-a-Mamma) అనే క్లాతింగ్‌ కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ఇటీవలే ఆలియా.. యంగ్​ టైగర్​ ఎన్టీఆర్‌ పిల్లలకు కూడా డ్రెస్సులు పంపించింది.

ప్రస్తుతం రామ్​చరణ్​​ దిగ్గజ దర్శకుడు శంకర్​ డైరెక్షన్​లో గేమ్​ ఛేంజర్​ సినిమా చేస్తున్నారు. ఇటీవల రామ్​చరణ్‌ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్​ వచ్చింది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి బరిలో దించాలని చిత్ర యూనిట్​ భావిస్తోంది. ఇక దర్శకుడు శంకర్ 'భారతీయుడు 2' సినిమా షూటింగ్ షెడ్యూల్‌ను తైవాన్‌లో కంప్లీట్ చేసుకున్నారు. తిరిగి వచ్చాక మళ్లీ 'గేమ్ ఛేంజర్'తో బిజీ అవుతారని సమాచారం. అంతలోపు రామ్ చరణ్‌ కూడా మాల్దీవులు తిరిగి వస్తాడని తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details