Chiranjeevi acharya movie: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా 'ఆచార్య'. ఈ మూవీలో చిరు తనయుడు రామ్‌చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ సినిమా కోసం డబ్బింగ్ స్టార్ట్ చేశారు రామ్‌చరణ్. దేవాలయాల నేపథ్య కథతో తీసిన ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్గా చేసింది. మణిశర్మ సంగీతమందించారు. కొరటాల శివ దర్శకత్వం వహించారు.
ఆచార్య డబ్బింగ్లో రామ్‌చరణ్- లైగర్ కోసం మైక్ టైసన్ - liger movie dubbing
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా 'ఆచార్య'లో తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకునే పనిలో నిమగ్నమయ్యారు రామ్‌చరణ్. అలాగే లైగర్ సినిమాలో తమ డబ్బింగ్‌ను పూర్తి చేశారు మైక్‌టైసన్.
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తో మైక్ టైసన్ భారతీయ సినిమాల్లోకి అడుగుపెట్టారు. తాజా తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ను పూర్తి చేశారు మైక్ టైసన్. మైక్ టైసన్ ఈ చిత్రంలో ఒక పవర్ ఫుల్ పాత్రను పోషించారు. అతనికి సంబందించిన సన్నివేశాలు ఈ చిత్రం హైలైట్‌లలో ఒకటిగా ఉంటాయి. విజయ్ దేవరకొండ, మైక్ టైసన్ కలిసి తెరపై చూడటం అభిమానులకు పండగే అని చెప్పాలి.