సినిమా ప్రమోషన్స్, షూటింగ్స్, పర్సనల్ మీటింగ్స్.. ఇలా వరుస పనులతో ఫుల్ బిజీగా ఉంటున్నారు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్. 'ఆర్‌ఆర్‌ఆర్', 'ఆచార్య' విడుదల పూర్తైన వెంటనే ఎటువంటి బ్రేక్ తీసుకోకుండా ఆయన శంకర్ సెట్‌లోకి అడుగుపెట్టారు. శంకర్ తెరకెక్కిస్తోన్న సినిమా షూటింగ్‌లో గత కొన్నిరోజుల నుంచి ఆయన పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఈ షూట్ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జరుగుతోంది.
ఉపాసన.. మనం కొంత కాలం ఆగాల్సిందే: రామ్‌చరణ్ - ram charan upasana vacation
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్.. ఆయన సతీమణిని ఉద్దేశించి ఆసక్తికరమైన పోస్ట్ పెట్టాడు. అది ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇంతకీ చెర్రీ తన ఇన్‌స్టాలో ఏం పోస్ట్ పెట్టాడంటే?
ఉపాసాన
ఇదిలా ఉండగా.. చరణ్ సతీమణి ఉపాసన గురువారం సాయంత్రం తన పాత వెకేషన్ ఫొటోని షేర్ చేశారు. హాలీడేకి వెళ్లడానికి ఇంకాస్త వేచి ఉండాలని చరణ్ స్పందించారు. 'ఉపాసన నా మనసులో కూడా హాలీడేకు వెళ్లాలని ఉంది..!! కాకపోతే #RC15 షూట్ విశాఖలో జరుగుతోన్న కారణంగా మనం ఇంకొంత కాలం వేచి ఉండాల్సిందే' అని తెలిపారు. చరణ్ పెట్టిన నెటిజన్లతో పాటు మెగా అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది.
ఇదీ చదవండి:'ఢీ' షోలో.. చిరంజీవి, పవన్‌కల్యాణ్ డ్యాన్స్ అదుర్స్!