Ram Charan Foreign Trip :మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ఫ్యామిలీని తీసుకొని ఫారిన్ ట్రిప్‌కు వెళ్తున్నారు. తన భార్య ఉపాసన, కూతురు క్లీంకార, పెట్ రైమ్‌ను తీసుకుని ట్రిప్‌కు బయలుదేరారు. ఈ మేరకు ఎయిర్ పోర్టులో దర్శనం ఇచ్చాడు. చెర్రీ చేతిలో రైమ్, ఉపాసన ఒడిలో క్లీంకార ఇలా ఇద్దరు క్యాజువల్ లుక్స్‌లో ఎయిర్ పోర్టులో ప్రత్యక్షమయ్యారు. ప్రస్తుతం వీళ్ల ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఉపాసన తన కూతురు ముఖాన్ని మాత్రం కెమెరాలకు చూపించలేదు.
రామ్ చరణ్ తన కూతురు పుట్టాక ఇదే మొదటి ట్రిప్ కానుంది. చెర్రీ తన కూతుర్ని ఇటలీకి తీసుకెళ్తున్నారని సమాచారం. 'గేమ్ ఛేంజర్' షూటింగ్‌తో బిజీగా ఉన్న చరణ్.. ఇలా తన ఫ్యామిలీకి కొంత టైమ్ కేటాయించి ఫారిన్ ట్రిప్‌కి వెళ్తున్నారు. ఉపాసన క్లీంకారను, చెర్రీ రైమ్‌లను తీసుకుని వెళ్తుండగా.. ఎయిర్ పోర్టు వద్ద క్లిక్‌మనిపించిన ఫోటోలు మెగా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముగ్గురూ చూడముచ్చటగా ఉన్నారంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
Ram Charan Baby : క్లీంకార రాకతో మెగా ఫ్యామిలీలో ఆనందం వెల్లివిరిసిందన్న సంగతి తెలిసిందే. ఇక క్లీంకారతో కలిసి మెగాస్టార్ చిరంజీవి దిగినవి, మనవరాలిని ఎత్తుకుని చిరు సంబరపోతూ ఉన్న ఫోటోలు అభిమానులను ఆకట్టుకున్నాయి. మెగా ప్రిన్సెస్ కొణిదెల ఇంటికి వచ్చిన తరుణంలో చిరంజీవి ప్రత్యేకంగా వేదమంత్రాలు పఠించే వారిని తీసుకొచ్చి మరీ ఆహ్వానం పలికించారు.