Ram Charan daughter name : మెగా ప్రిన్సెస్ నామకరణం శుక్రవారం ఘనంగా జరిగింది. రామ్ చరణ్-ఉపాసన బిడ్డకు 'క్లీం కార కొణిదెల' అని పేరు పెట్టారు. ఈ కార్యక్రమం 'క్లీం కార కొణిదెల' అనే పేరును లలితా సహస్రనామం నుంచి స్ఫూర్తి పొంది పెట్టినట్లు మెగా ఫ్యామిలీ వెల్లడించింది. 'క్లీం కార కొణిదెల' అంటే ప్రకృతి అవతారమని, మహాశక్తిని అని అర్థం స్ఫురిస్తుంది.
ఓంకార రూపిణి, క్లీంకార వాసిని
జగదేక మోహిని, ప్రకృతి స్వరూపిణి ॥
రామ్చరణ్ - ఉపాసనదంపతులు అడపిల్లకు జన్మను ఇవ్వగానే.. ఆ చిన్నారి నక్షత్రం, రాశి, పూర్తి జాతకంపై ఆయా స్వామీజీలు దృష్టి సారించారు. ఈ క్రమంలో పాపకు ఏం పేరు పెట్టనున్నారన్న విషయంపై అటు సోషల్ మీడియాలో చర్చలు జరిగాయి. అయితే ఉపాసన డెలివరీ సమయంలో ప్రెస్ మీట్లో రామ్ చరణ్ కూడా పాప పేరు ఇప్పటికే డిసైడ్ చేశామని చెప్పడం వల్ల.. అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. చివరికి అందరి నిరీక్షణకు తెర దించుతూ.. బారసాల కార్యక్రమంలోనే మెగా ప్రిన్సెస్ పేరును రివీల్ చేశారు. ఈ నామకరణ మహోత్సవ కార్యక్రమంలో చిరు.. సంప్రదాయ పంచె కట్టులో కనిపించారు. చిరంజీవి దంపతులు, వారి వియ్యంకులు చిన్నారిని ఊయలలో ఊపుతూ ఉన్న ఓ ఫొటోను విడుదల చేశారు.
నామకరణ మహోత్సవంలో మెగా ఫ్యామిలీ చెక్క ఊయలలోనే మెగా ప్రిన్సెస్కు బారసాల.. క్లారిటీ ఇచ్చిన చెర్రీ అండ్ టీమ్..!
Ramcharan : హీరో రామ్చరణ్-ఉపాసన దంపతుల కూతురుకు.. వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీ పంపిన బంగారు ఊయలలో బారసాల చేశారనే వార్తలపై స్పష్టత ఇచ్చింది చెర్రీ అండ్ టీమ్. ఆ వార్తలన్నీ కేవలం పుకార్లేనని కొట్టిపారేసింది. ప్రజ్వల ఫౌండేషన్ వాళ్లు సిద్ధం చేసిన చెక్క ఉయ్యాలలోనే చిన్నారి బారసాల వేడుకలు జరిపినట్లు స్పష్టం చేసింది.
"ప్రజ్వల ఫౌండేషన్ నుంచి ఇలాంటి హృదయపూర్వక కానుకపొందినందుకు చాలా సంతోషంగా ఉంది. చేతితో తయారు చేసిన ఈ ఉయ్యాలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. బలం, ఆశకు ఇది ప్రతీక. పరివర్తన, ఆత్మగౌరవాన్ని ఈ ఊయల సూచిస్తుంది. నాకు పుట్టబోయే బిడ్డ కూడా ఈ విలువలను కలిగి ఉండాలని ఆశిస్తున్నాను" అంటూ ఉప్సీ అప్పట్లో తన ఇన్స్టాగ్రమ్లో ఓ పోస్ట్ పెట్టారు.
జూన్ 20న హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో 11 ఏళ్ల తర్వాత వీరికి సంతానం కలగడం వల్ల మెగా ఇంట్లో సంబరాలు అంబరాన్నంటాయి.