మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఆర్సీ-15 అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ లేట్ అవుతుండటం వల్ల అభిమానుల్లో కలవరం మొదలైంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఫొటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. అందులో రామ్ చరణ్ వివిధ రకాల ఆహార్యాల్లో కనిపిస్తున్నారు. అతడికి తోడు కథానాయిక అంజలి కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ ఫొటోలు హాట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ఫొటోలను బట్టి సినిమా స్టోరీ గురించి అనేక ఊహాగానాలు వినబడుతున్నాయి.
కొన్ని ఫొటోల్లో రామ్ చరణ్ ధోతి కట్టుకుని.. ఇంటిముంగిట కూర్చొని ఉన్నట్లు ఉంది. దీన్ని చూస్తే మెగాస్టార్ చిరంజీవి 'స్వయం కృషి' సినిమా గుర్తుకొస్తుందని అనుకుంటున్నారు. మరో పక్క ఓ ఫొటో ఫ్రేమ్‌లో రామ్ చరణ్-అంజలి ఉన్నారు. ఆ ఫొటోలో ఎస్వీసీ అని హ్యాష్ ట్యాగ్ జోడించారు. మరో ఫొటోలో చరణ్, అంజలితో పాటు ఓ బాలుడు ఉన్నాడు. మరో పక్క షూటింగ్ స్పాట్లో ఫోన్ పట్టుకుని హీరోయిన్ అంజలి కనిపించింది. కొన్ని ఫొటోల్లో భారతీయుడులో కమల్ హాసన్‌ను, రామ్ చరణ్‌ను పక్క పక్కన పెట్టి పోలుస్తున్నారు. అయితే ఇవి లీకైన ఫొటోలా లేదా ఎవరైనా అభిమానులు క్రియేట్ చేశారా అన్న విషయం తెలియాల్సి ఉంది. నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కూడా అధికారింకంగా ఏ అప్డేట్ ఇవ్వలేదు.