తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆస్కార్​ కోసం రంగంలోకి ఆర్​ఆర్​ఆర్​ టీమ్.. పదివేల మంది సభ్యులతో..​ - ఆర్​ఆర్​ఆర్​ లేటెస్ట్ న్యూస్​

ఆస్కార్​ నామినేషన్స్​కు అర్హత సాధించకపోవడంపై 'ఆర్​ఆర్​ఆర్​' టీమ్​ పరోక్షంగా రంగంలోకి దిగింది. ఏం చేయబోతుందంటే?

RRR oscar
ఆర్​ఆర్​ఆర్​ ఆస్కార్​

By

Published : Sep 21, 2022, 3:15 PM IST

'ఆర్​ఆర్​ఆర్​' చిత్రానికి ఆస్కార్​ రావడం ఖాయమని ప్రేక్షకులు, పరిశ్రమ ప్రముఖులు భావించిన నేపథ్యంలో ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ పెద్ద షాకే ఇచ్చింది. జ్యూరీ సభ్యులు ఆస్కార్ నామినేషన్స్​కు ఆర్​ఆర్​ఆర్​ను కాదని గుజరాతీ సినిమా 'ఛెల్లో షో'ను ఎంపిక చేశారు. దీంతో 'ఆర్ఆర్ఆర్'కు ఆస్కార్ అందుకునే అవకాశం ముగిసినట్లేనని అందరూ నిరాశపడ్డారు. కానీ ఇప్పుడు అవకాశం ఇంకా మిగిలి ఉందని తెలుస్తోంది. దీని కోసం 'ఆర్ఆర్ఆర్' టీమ్ పరోక్షంగా రంగంలోకి దిగబోతోంది.

రంగంలోకి అమెరికా డిస్ట్రిబ్యూటర్.. 'ఆర్ఆర్ఆర్' అభిమానులకు శుభవార్త ఏంటంటే... సినిమా అమెరికా డిస్ట్రిబ్యూటర్ దైలన్​ మార్చెట్టి.. తమ సినిమాను అన్ని విభాగాల్లో నామినేట్ చేయాలని ఆస్కార్ అకాడమీలోని పదివేల మంది సభ్యులకు పిలుపు ఇవ్వనున్నట్లు తెలిపారు. వారితో కలిసి క్యాంపెయిన్ ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. ఉత్తమ సినిమా, ఒరిజినల్​ స్క్రీన్​ప్లే(రాజమౌళి-విజయేంద్రప్రసాద్), లీడ్ యాక్టర్స్​(ఎన్టీఆర్​, రామ్​చరణ్​), సహాయ నటీనటులు(అజయ్​దేవగమ్​, ఆలియాభట్​), ఒరిజినల్ సాంగ్(నాటునాటు), ఒరిజినల్ స్కోర్(ఎమ్​ఎమ్​ కీరవాణి), సినిమాటోగ్రఫీ(కేకే సెంథిల్​కుమార్​).. ఇంకా మిగతా విభాగాల్లో నామినేషన్స్​కు 'ఆర్ఆర్ఆర్'ను స‌బ్‌మిట్‌ చేయనున్నట్లు దైలన్​ మార్చెట్టి పేర్కొన్నారు. "గత ఆరు నెలల్లో రాజమౌళి ఆర్​ఆర్​ఆర్​ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియెన్స్​కు ఎంతో థ్రిల్​కు గురయ్యారు. ఇండియాస్ ఆల్​టైమ్​​ హైయెస్ట్​ గ్రాసింగ్ ఫిల్మ్స్​లో ​ఒకటిగా నిలిచింది. నెట్​ఫ్లిక్స్​లో దాదాపు 14వారాల పాటు నిరంతరంగా గ్లోబల్ వైడ్​గా ట్రెండ్​ అవుతూ చరిత్ర సృష్టించింది. ఈ చిత్రం తర్వాత మళ్లీ థియేటరల్నీ కళకళలాడాయి. కాబట్టి ఆర్​ఆర్​ఆర్​ అన్ని విభాగాల్లో నామినేట్​ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం" అని అన్నారు. కాగా, ఈ అమెరికా డిస్ట్రిబ్యూటర్ రంగంలో దిగడంతో తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈయన పిలుపు మేరకు అకాడమీలోని మెజారిటీ సభ్యులు ఓట్లు వేస్తే ఆర్​ఆర్​ఆర్​కు నామినేషన్స్ లభించవచ్చు.

సోషల్​మీడియాలో నిరసన.. 'ఆర్ఆర్ఆర్'ను ఆస్కార్స్‌కు పంపించలేదని తెలిసిన తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయ్యింది. సినిమా అభిమానులు చాలా మందికి ఆ నిర్ణయం మింగునపడలేదు. ఎవరికీ తెలియని సినిమాను పంపిస్తున్నారని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే 'ఆర్ఆర్ఆర్' సినిమా యూనిట్ సభ్యులు ఎవరూ ఆస్కార్ ఎంట్రీ లభించకపోవడంపై స్పందించలేదు.

ఇదీ చూడండి:'ఆర్ఆర్ఆర్​'కు నిరాశ.. భారత్ తరఫున 'ఆస్కార్'కు ఎంపికైన చిత్రం ఇదే

ABOUT THE AUTHOR

...view details