కన్నడ దర్శకుడు నార్తన్-మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో ఓ సినిమా వస్తుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇన్నాళ్లకీ వారిద్దరి మధ్య చర్చలు సఫలం అయినట్లు తెలుస్తోంది. నార్తన్ దర్శకత్వంలోనే రామ్ చరణ్ కొత్త మూవీ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం అందుతోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే రామ్ చరణ్ పుట్టిన రోజు మార్చి 27వ తేదిన ఈ సినిమాపై పుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఆ కన్నడ డైరెక్టర్‌కు చరణ్ గ్రీన్ సిగ్నల్.. ఆ రోజే అనౌన్స్మెంట్! - Kannada director Northan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. 'ఆర్ సీ17' త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారట. ఆ వివరాలు..
ఆర్ఆర్ఆర్ సినిమాతో మంచి సక్సెస్‌ను అందుకున్న చరణ్.. ఆ తర్వాత తన తండ్రి చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో ఓ కీలక పాత్ర పోషించాడు. కానీ ఆ సినిమా భారీ పరాజయాన్ని అందుకుంది. దీంతో తన కొత్త చిత్రాలను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు చరణ్. ఈ క్రమంలోనే ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఆర్ సీ15 సినిమా చిత్రీకరణలో పుల్ బిజీగా ఉన్న ఆయన.. మరో వైపు కథలపై కూడా పూర్తి దృష్టి పెట్టారు. అలా ఇప్పటికే ఆర్ సీ16గా బుచ్చిబాబుతో ఓ సినిమాను ప్రకటించారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు అవుతున్నాయి. త్వరలోనే సెక్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.
దీని తర్వాత నార్తన్ దర్శకత్వంలో ఆర్ సీ 17 రూపొందనుంది. అలా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ చరణ్ బర్త్ డేన వచ్చే అవకాశముంది. ఇక ఈ విషయం తెలుసుకుంటున్న అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.