'ఆర్ఆర్ఆర్' సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. హిందీలో కూడా ఆర్ఆర్ఆర్ చిత్రం 200 కోట్ల కలెక్షన్లను సాధించింది. దీంతో ముంబయిలో సక్సెస్ పార్టీ ఇచ్చారు డిస్ట్రిబ్యూట్ జయంతిలాల్. ఈ పార్టీకి రామ్‌చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి, దానయ్యతోపాటు బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యారు. కరణ్ జోహార్, జావేద్ అక్తర్, అమీర్ ఖాన్ సక్సెస్ సెలెబ్రేషన్స్‌లో పాల్గొన్నారు.
ఎన్టీఆర్, రామ్‌చరణ్‌తో రాఖీ సావంత్ రచ్చ - వీడియో వైరల్ - rakhi sawant karan johar
హిందీలో ఆర్ఆర్ఆర్ సినిమా భారీ కలెక్షన్లను రాబడుతోంది. ముంబయిలో మూవీ సక్సెస్ పార్టీ జరగ్గా.. బాలీవుడ్ హాట్ బాంబ్ రాఖీ రచ్చ రచ్చ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాఖీ సావంత్
ఈ పార్టీలో బాలీవుడ్ హాట్ బాంబ్ రాఖీ సావంత్ కూడా మెరిసింది. ఎర్రటి అవుట్ ఫిట్‌తో రచ్చ రచ్చ చేసింది. అంతేకాదు.. 'నాటు నాటు' పాటకు స్టెప్పులు వేసి.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ సందర్భంగా తన ఫేవరెట్ హీరో రామ్ చరణ్ ను కలిశానని, తారక్ తోనూ ముచ్చటించినట్లు చెప్పుకొచ్చింది ఈ భామ. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.