Rakul Preet Singh Wedding Date :తెలుగు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నట్లు సమాచారం. తాను ఎంతో కాలం నుంచి ప్రేమలో ఉన్న బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ఎడడుగులు నడవబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 22న గోవాలోని ఓ ప్రముఖ రిసార్ట్‌లో వీరి పెళ్లి జరగనుందంటూ ప్రచారం జరుగుతోంది. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరగనుందని, ఆ తర్వాత సినీ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా విందు ఇవ్వనున్నారని పలు వార్తలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లు, అభిమానులు రకుల్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఈ విషయంపై రకుల్ గానీ, జాకీ భగ్నానీ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.
గతంలో పలు సందర్భాల్లో వీరి వివాహం గురించి ఇలాంటి వార్తలు వచ్చాయి. అయితే సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటామని అప్పుడు రకుల్ స్పష్టతనిచ్చారు.
Rakul Preet Singh Boyfriend :బీటౌన్ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీతో తాను రిలేషన్‌లో ఉన్నానంటూ 2021లో రకుల్ ప్రకటించారు. అప్పటినుంచి సోషల్ మీడియాలో ఇద్దరూ కలిసున్న ఫొటోలను షేర్ చేసుకున్నారు. ఈ అమ్మడి పుట్టిన రోజు (అక్టోబర్ 10) సందర్భంగా జాకీ భగ్నానీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. తన స్పెషల్ పర్సన్ అంటూ రకుల్‌కు విషెస్ చెప్పారు.