సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో 'శివాజీ' ఒకటి. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు అదిరిపోయే కలెక్షన్లను వసూలు చేసింది. బ్లాక్ మనీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లోనూ సూపర్ హిట్‌గా నిలిచింది. ఎమోషనల్, మాస్ ఎలిమెంట్స్, కామెడీ.. ఇలా అన్ని అంశాలను ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
అయితే ఈ చిత్రంలో ఓ హాస్య సన్నివేశం ఉంటుంది. దీపావళి పండగ సందర్భంగా రజనీకాంత్ పండ్లు పలహారాలతో హీరోయిన్ శ్రియ ఇంటికి వెళ్తారు. కానీ శ్రియ ఇంట్లో వాళ్ళు రజినీకాంత్‌ను ఇంట్లోకి రానివ్వరు. అయితే అదే సమయంలో శ్రియ ఇంటికి ఎదురుగా ఉండే ఓ వ్యక్తి వచ్చి నాకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు మా ఇంటికి రండి అంటూ పిలుస్తాడు.