Rajinkanth Golden Ticket :క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2023 ప్రపంచకప్ పోరుకు సరిగ్గా 15 రోజుల సమయం మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రముఖులకు అందించే గోల్డెన్ టికెట్ల పంపిణీ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఈ నెలలోనే ఆ టికెట్లను బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్, క్రికెట్ గాడ్ సచిన్ తెందూల్కర్‌లు అందుకోగా.. మంగళవారం తమిళ తలైవ సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా అందుకున్నారు. దీనిని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) సెక్రేటరీ జై షా ఆయనకు అందజేశారు. ఈ విషయాన్ని బీసీసీఐ తమ అధికారిక ఎక్స్(ట్విట్టర్) వేదికగా ప్రకటించింది.
Rajinkanth Golden Ticket : అప్పుడు బిగ్‌బీ.. ఇప్పుడు సూపర్‌స్టార్.. 'జైలర్' హీరోకు బీసీసీఐ 'గోల్డెన్ టికెట్'! - గోల్డెన్ టికెట్ అంటే ఏంటి
Rajinkanth Golden Ticket : భారత్‌లో ప్రముఖులకు అందించే గోల్డెన్ టికెట్ల పంపిణీ జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, క్రికెట్ లెజెండ్ సచిన్ తెందూల్కర్‌లు ఈ టికెట్‌ను అందుకోగా.. తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు కూడా ఈ గోల్డెన్ టికెట్‌ను అందజేశారు బీసీసీఐ సెక్రేటరీ జై షా. ఆ వివరాలు.
Published : Sep 19, 2023, 5:23 PM IST
|Updated : Sep 20, 2023, 6:09 AM IST
ఏంటీ గోల్డెన్ టికెట్..?
What Is Golden Ticket In World Cup : మరో 15 రోజుల్లో ప్రారంభం కాబోతున్న ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్-2023 ప్రచారంలో భాగంగా బీసీసీఐ ఈ గోల్డెన్ టికెట్ల పంపిణీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. వీలైనంత ఎక్కువగా ఈ టోర్నీకి ప్రచారం కల్పించడమే లక్ష్యంగా దీనిని తీసుకువచ్చారు. ఇందులో భాగంగా దేశంలోని సెలబ్రిటీలకు ఈ గోల్డెన్ టికెట్లను ఇస్తున్నారు. ఇది పొందిన ప్రముఖులు ఈ మెగా ఈవెంట్లో భాగంగా జరిగే మ్యాచులన్నింటినీ వీఐపీ గ్యాలరీలో కూర్చొని మరీ ఫ్రీగా వీక్షించవచ్చు. వీరికి సకల సౌకర్యాలను ఏర్పాటు చేస్తుంది బీసీసీఐ. ఇక ఇప్పటివరకు అమితాబ్ బచ్చన్, సచిన్ తెందూల్కర్, రజనీకాంత్‌లు ఈ గోల్డెన్ టికెట్లను పొందారు.
ICC World Cup 2023 : 2023లో జరగనున్న ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్‌కు భారత్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఈ ప్రపంచ కప్ సమరం జరగనుంది. అక్టోబర్ 5న గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగే పోరుతో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. ఇక ఇదే మైదానంలో ఆదివారం నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్‌లో ప్రత్యర్థులు తలపడతారు. ఇకపోతే భారత్ తన తొలి మ్యాచ్‌ను చెన్నై వేదికగా అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో ఆడనుంది.