Rajinikanth Yogi Feet : సూపర్ స్టార్ రజినీకాంత్.. గత కొద్ది రోజులుగా సోషల్‌మీడియా, టెలివిజన్ మీడియాలో హాట్‌టాపిక్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. కాంట్రవర్సీలకు కూడా గురౌతున్నారు. ప్రస్తుతం ఆయన దేశమంతా తిరుగుతూ 'జైలర్' సినిమా విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఝార్ఖండ్ ముఖ్యమంత్రితో కలిసి రాంచీలో చిత్రాన్ని వీక్షించిన ఆయన.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ప్రసాద్ మౌర్యతోనూ కలిసి సినిమా చూశారు. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిసిన రజనీ.. ఆ సమయంలో యోగికి పాదాభివందనం కూడా చేశారు.
Rajinikanth Yogi Adityanath : అయితే ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ముఖ్యంగా తమిళ ప్రజల ఆగ్రహానికి గురయ్యారు రజనీ. యోగీ కాళ్లు మొక్కడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. రజనీ అలా చేయడాన్ని తప్పుపడుతున్నారు. అయితే తాజాగా తనపై వస్తున్న విమర్శలకు సూపర్ స్టార్ స్పందించారు.
"యోగి, సన్యాసీల పాదాలను తాకి, వారి ఆశీర్వాదాలను తీసుకోవడం నా అలవాటు. నాకన్నా చిన్నవారైనా ఇలానే చేస్తాను. అదే ఇప్పుడు కూడా చేశాను" అంటూ తాను చేసిన పనిని సమర్థించుకున్నారు. అలాగే 2024లో తమిళనాడులో జరగబోయే లోక సభ ఎలెక్షన్స్ గురించి అడగగా.. తాను ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడనుకోవట్లేదని పేర్కొన్నారు.