సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'జైలర్'. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో భాగంగా రజనీని కలిసేందుకు ఓ చిన్నారి రాగా, ఆమెను ఆప్యాయంగా పలకరించి, దగ్గరకు తీసుకుని, ఫొటోలు దిగారు. అనంతరం ఆ చిన్నారి రజనీ నుంచి ఆటోగ్రాఫ్ తీసుకుంది.
చిన్నారి అభిమానికి రజనీకాంత్ సర్ప్రైజ్ - చిన్నారి ఫ్యాన్‌తో రజనీకాంత్
జీవితంలో ఒక్కసారైన తమ అభిమాన కథానాయకుడిని కలవాలని, అతనితో ఫొటో దిగాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అలాంటి అవకాశం వస్తే అస్సలు వదులుకోరు. తాజాగా రజనీకాంత్‌తో ఓ చిన్నారి దిగిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. రజనీని చూడగానే ఆ చిన్నారి ఆనందానికి అవధుల్లేవు.
రజనీని కలిసినప్పుడు ఆమె కళ్లల్లో ఆనందానికి అంతులేదు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. రజనీ మరోసారి తన సింప్లిసిటీని ప్రదర్శించారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక 'జైలర్' విషయానికొస్తే ఇందులో శివరాజ్‌కుమార్, వసంత్ రవి, యోగిబాబు, రమ్యకృష్ణ తదితరులు నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతమందిస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తారు.
ఇదీ చూడండి: బాప్రే.. రమ్యకృష్ణ అందం తగ్గట్లేదుగా.. ఒకే నటుడికి చెల్లి, కూతురు, భార్యగా