తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సుశాంత్‌ సింగ్‌ నటించిన ఆ సూపర్​హిట్​ మూవీ రీమేక్‌లో రజనీకాంత్‌! - రజనీకాంత్​ కొత్త సినిమాలు

సూపర్​స్టార్​ రజనీకాంత్​ త్వరలో లైకా ప్రొడక్షన్స్‌లో ఓ సినిమా చేయనున్నారు. హీరోగా కాకుండా అతిథి పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా సుశాంత్​ సింగ్ నటించిన హిందీ సూపర్​ హిట్​ మూవీగా తెరకెక్కనుందట. ఆ వివరాలు..

rajnikanth sushant singh
rajnikanth sushant singh

By

Published : Nov 26, 2022, 12:23 PM IST

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించే చిత్రాల గురించి ప్రస్తావించగానే ఆయన అభిమానుల్లో ఎక్కడలేని జోష్‌ వస్తుంది. అయితే ఇటీవల సక్సెస్‌ ఆయనతో దోబూచులాడుతుందనే చెప్పాలి. బాషా, పడయప్పా, రోబో లాంటి హిట్‌ కోసం ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న జైలర్‌ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. రజనీ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రాన్ని నెల్సన్‌ దర్శకత్వంలో సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. నటి రమ్యకృష్ణ, కన్నడ నటుడు శివరాజ్‌ కుమార్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్​ సంగీతాన్ని అందిస్తున్న జైలర్‌ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌ స్పెషల్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

కాగా, రజనీకాంత్‌ లైకా ప్రొడక్షన్స్‌లోనే వరుసగా రెండు చిత్రాలు చేయబోతున్నారు. అందులో ఒక చిత్రానికి డాన్‌ చిత్రం ఫేమ్‌ విను చక్రవర్తి దర్శకత్వం వహించనున్నారు. రెండో చిత్రానికి రజనీకాంత్‌ పెద్ద కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించనున్నారు. దీనికి లాల్‌ సలాం అనే టైటిల్‌ నిర్ణయించారు. ఇందులో విష్ణు విశాల్‌ కథానాయకుడిగా నటించనున్నారు. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా హిందీలో సుశాంత్‌ సింగ్‌ నటించిన కైపో చేకు రీమేక్​గా తెరకెక్కనుందట. మరి ఇది నిజమో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ABOUT THE AUTHOR

...view details