తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Rajinikanth Mahavatar Babaji : ఉత్తరాదిలో రజనీ సందడి.. ఆ గుహలో 30నిమిషాల పాటు ధ్యానం.. గవర్నర్​తో భేటీ! - రజనీకాంత్ న్యూస్

Rajinikanth Mahavatar Babaji : 'జైలర్​' రిలీజ్​కు ముందు నుంచే ఉత్తర భారత దేశంలో పర్యటిస్తున్న సూపర్​స్టార్​ రజనీకాంత్​ తాజాగా ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో కనిపించారు. ద్వారాహత్‌లోని మహావతార్ బాబా గుహలో ధ్యానం చేశారు. ఆ విశేషాలు మీ కోసం..

Etv Bharat
Etv Bharat

By

Published : Aug 18, 2023, 10:13 AM IST

Updated : Aug 18, 2023, 10:21 AM IST

Rajinikanth Mahavatar Babaji : సూపర్ స్టార్ రజనీకాంత్​ ప్రస్తుతం ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా హిమాలయాలు, బద్రీనాథ్​ క్షేత్రాన్ని సందర్శించిన ఆయన.. తాజాగా ఉత్తరాఖండ్ ​అల్మోరాలోని ద్వారహత్​కు చేరుకున్నారు. అక్కడున్న మహావతార్ బాబా గుహలో 30 నిమిషాలు ధ్యానం చేశారు. యోగదా ఆశ్రమంలోని సాధువులను కలుసుకున్నారు. మార్గమధ్యంలో ఆయన్ను చూసేందుకు తరలి వచ్చిన అభిమానులతో సెల్ఫీలు దిగారు. మరుసటి రోజు ఉదయం ఆయన రాంచీకి బయలుదేరారు.

అల్మోరాలో రజనీకాంత్​
అల్మోరాలో రజనీకాంత్​
అల్మోరాలో రజనీకాంత్​

ఝార్ఖండ్​ గవర్నర్​తో భేటీ..
Rajini Meets Jharkhand Governor :బాబా గుహలను సందర్శించిన ఆయన.. ఆ తర్వాత ఝార్ఖండ్​లోని రాంచీకి వెళ్లారు. అక్కడి గవర్నర్‌ సీపీ.రాధాకృష్ణన్​ను కలిసి కాసేపు మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫొటోలను గవర్నర్​ రాధాకృష్ణ ట్విట్టర్​ వేదికగా పంచుకున్నారు.

ఝార్ఖండ్​ గవర్నర్​తో రజనీకాంత్​

"రాంచీకి రజనీ రావడం ఆనందంగా ఉంది. నా ప్రియ మిత్రుడైన ఆయనను రాజ్‌భవన్‌లో కలవడం చాలా సంతోషంగా ఉంది. ఝార్ఖండ్‌ అనే గొప్ప ప్రదేశానికి ఆయనకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను" అంటూ రాధాకృష్ణ రాసుకొచ్చారు.

Rajinikanth Jailer : 'జైలర్' రిలీజ్​కు ముందే హిమాలయాలకు బయలుదేరిన రజనీ ప్రస్తుతం ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్నారు. ఇక ఈ పర్యటన తర్వాత ఆయన చెన్నైకి తిరిగి వచ్చి 'జైలర్​' మూవీ టీమ్​తో సెలబ్రేషన్స్​ చేసుకోనున్నారట. ప్రస్తుతం రజనీకాంత్ తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ తెరకెక్కించిన 'లాల్ సలామ్' సినిమాలో గెస్ట్​ రోల్​ చేశారు. ఈ ప్రాజెక్ట్​ తర్వాత 'జై భీమ్'​ దర్శకుడు జ్ఞానవేల్​తో కలిసి పనిచేయనున్నారు.

Rajinikanth Jailer Cast :ఇక సినిమా విషయానికి వస్తే.. సూపర్ స్టార్ రజనీకాంత్ లీడ్​ రోల్​లో తెరకెక్కిన 'జైలర్​'ను తమిళ దర్శకుడు నెల్సన్​ దిలీప్​ కుమార్​ రూపొందించారు. యాక్షన్​, సెంటిమెంట్​,కామెడీ ఇలా అన్ని అంశాలను ఎంతో చక్కగా ఆయన చూపించారు. ఇందులో రజనీకి జోడిగా సీనియర్ హీరోయిన్​ రమ్యకృష్ణ మెరవగా.. మిల్క్​ బ్యూటీ తమన్న ఓ కీలక పాత్ర పోషించారు.

మరోవైపు మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, కన్నడ స్టార్​ హీరో శివ రాజ్‌కుమార్ గెస్ట్​ రోల్స్​లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక రజనీకాంత్​ కూడా తన మార్క్​ స్టైల్​తో ప్రేక్షకులకు వింటేజ్​ రజనీని గుర్తుచేశారు. యంగ్​ మ్యూజిక్​ డైరెక్టర్​​ అనిరుధ్​ రవిచందర్​ అందించిన సాంగ్స్​, బ్యాక్​గ్రౌండ్​ స్కోర్​ ఈ సినిమాకు మరో హైలైట్​గా నిలవగా..సునీల్, జాకీ ష్రాఫ్, యోగి బాబు తమ తమ పాత్రలతో ఆడియెన్స్​ను అలరించారు.

Rajnikanth Badrinath Visit : బద్రీనాథ్‌లో సూపర్​ స్టార్​ సందడి.. రజినీతో ఫొటో కోసం ఫ్యాన్స్ ఆసక్తి

Rajinikanth Himalayas : 4ఏళ్ల తర్వాత మళ్లీ హిమాలయాలకు రజనీ.. 'జైలర్​' రిలీజ్‌కు ముందే..

Last Updated : Aug 18, 2023, 10:21 AM IST

ABOUT THE AUTHOR

...view details