Rajinikanth Jailer Movie Release Date : సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కొత్త చిత్రం 'జైలర్'. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా ఆగస్టు 10న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి కొన్ని విషయాలను తెలుసుకుందాం...
- సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా కాలంగా ఫామ్‌లో లేరు. ఆయన నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌గా హిట్ అయినప్పటికీ.. కంటెంట్ పరంగా అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. రోబో 2.0, పేట, దర్బార్, అన్నాత్తే వంటి చిత్రాలు వరుసగా ఫ్యాన్స్‌ను మెప్పించలేకపోయాయి. దీంతో రజనీ ఈ సారి ఏ దర్శకుడికి ఛాన్స్ ఇస్తారా అనే ఆసక్తిగా అందరిలో నెలకొనగా.. రజనీ ఎవరూ ఊహించని విధంగా దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్‌కు అవకాశం ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు.
- నెల్సన్ కుమార్ రూపొందించిన మొదటి చిత్రం 'కొలమావు కోకిల'. నయనతారతో ఈ సినిమా చేశారు. ఆ తర్వాత శివ కార్తికేయన్‌తో 'వరుణ్ డాక్టర్', దళపతి విజయ్‌తో 'బీస్ట్' చేశారు. వీటిలో 'బీస్ట్'కు మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో రజినీ .. దర్శకుడిను మార్చాలని పలువురు సూచించారు. కానీ రజనీ మాత్రం.. ఆ మాటలేమి వినకుండా నెల్సన్కే అవకాశం ఇచ్చారు.
- #Thalaivar169 వర్కింగ్ టైటిల్‌తో గతేడాది ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. జూన్‌లో 'జైలర్' టైటిల్‌ను అనౌన్స్ చేశారు. ఆగస్టులో షూటింగ్ ప్రారంభించారు.
- 'జైలర్'తో పాటు నెల్సన్ దర్శకత్వం వహించిన మిగతా మూడు చిత్రాలకు అనిరుధే సంగీతం అందించడం విశేషం. రీసెంట్గా 'నువు కావాలయ్యా' సాంగ్ యూట్యూబ్‌లో 100 మిలియన్స్‌కు పైగా వ్యూస్ అందుకుని రికార్డు సృష్టించింది. ఇకపోతే ఈ చిత్రానికి ముందు రజనీకాంత్- అనిరుధ్ కాంబోలో 'దర్బార్', 'పేట' సినిమాలొచ్చాయి.
- Rajinikanth Cast Details : ఈ సినిమాలో మొదటగా హీరోయిన్గా ఐశ్వర్యరాయ్, కీలక పాత్రల్లో ప్రియాంక అరుళ్ మోహన్, హీరో శివ కార్తికేయన్ నటిస్తారని అంతా అన్నారు. కానీ మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ స్టార్ యాక్టర్ జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషించారు. తమన్నా, రమ్యకృష్ణ, మిర్నా మేనన్, సునీల్, వసంత్ రవి, యోగిబాబు ఇతరులు కూడా నటించారు.
- Rajinikanth Ramya Krishnan Movies :రజనీకాంత్-రమ్యకృష్ణ కాంబోలో గతంలో 1985లో వచ్చిన 'నరసింహ' సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత సుమారు 24 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఇద్దరు కలిసి జైలర్‌లో నటించారు. 2002లో వచ్చి 'బాబా' చిత్రంలో రమ్యకృష్ణ గెస్ట్ రోల్లో నటించింది.
- ఈ సినిమాలో రజనీకాంత్.. టైగర్ ముత్తువేల్ పాండియన్ అనే జైలర్ పాత్రలో నటించారు. 2002లో విడుదలైన 'బాబా' తర్వాత 'పేట' చిత్రంలోనే 'సూపర్‌స్టార్ రజనీ' అనే ఒరిజినల్ గ్రాఫిక్ టైటిల్ కార్డును వినియోగించారు. మళ్లీ 'జైలర్'లోనూ అది ఉండనుందని తెలుస్తోంది.
- Jailer Audio Launch : ఈ సినిమా ఆడియా ఈవెంట్ చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు 1000 ఎంట్రీ పాసులు ఫ్రీ ఇచ్చారు. అయితే దీనికోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పగా.. రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసిన 15 సెకన్లలోనే పాస్‌లన్నీ బుక్ అయిపోవడం విశేషం. అదీ రజనీకాంత్ క్రేజ్.
- Jailer Overseas Booking : ఓవర్సీస్లో జైలర్ ఓ రికార్డు దశగా దూసుకెళ్తోంది. యూఎస్ఏలో ప్రీమియర్స్‌కు భారీగా స్పందన లభిస్తోందని తెలిసింది. ఇప్పటికే $800K దాటేసిందని తెలిసింది. 1 మిలియన్ డాలర్స్ మార్క్ దిశగా దూసుకెళ్తోందట.ఒకవేళ ఈ చిత్రం 1 మిలియన్ డాలర్స్ మార్క్ ను అందుకుంటే.. ఈ ఏడాది యూఎస్ఏ బాక్సాఫీస్ ముందు ఫస్ట్ మిలియన్ డాలర్ మార్క్ అందుకున్న మొదటి ఇండియన్ ఫిల్మ్‌గా జైలర్ నిలుస్తుంది.
- ఇకపోతే ఈ సినిమా జైసల్మేర్, మంగళూరు, హైదరాబాద్, చెన్నై సహా పలు ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంది. సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో సినిమా రూపొందించారు. ఈ సినిమా నిడివి 168 నిమిషాలు.
- సాధారణంగా రజనీకాంత్ సినిమా రిలీజ్ అంటే చెన్నైలోని కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు సెలవును ప్రకటిస్తాయి. ఇప్పుడు 'జైలర్' విషయంలోనూ అదే జరిగింది.