తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మ‌హేశ్​బాబుతో ర‌జ‌నీకాంత్ బాక్సాఫీస్ ఫైట్‌!.. జైల‌ర్ రిలీజ్ డేట్ మార‌నుందా? - జైలర్​ రజనీ కాంత్​ సినిమా

ర‌జ‌నీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న జైల‌ర్ రిలీజ్ డేట్ మార‌నున్న‌ట్లు కోలీవుడ్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌హేశ్​బాబు - త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబీ28 సినిమాతో బాక్సాఫీస్ వ‌ద్ద జైల‌ర్ పోటీప‌డే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

rajinikanth-jailer-movie-release-date-postponed-to-august-mahesh-babu-vs-rajinikanth-box-office-fight
rajinikanth-jailer-movie-release-date-postponed-to-august-mahesh-babu-vs-rajinikanth-box-office-fight

By

Published : Jan 21, 2023, 10:20 PM IST

బాక్సాఫీస్ వ‌ద్ద మ‌హేశ్​బాబుతో పోటీప‌డేందుకు ర‌జ‌నీకాంత్ సిద్ధ‌మ‌వుతోన్న‌ట్లు స‌మాచారం. మ‌హేశ్​బాబు- ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబీ28 మూవీ ఆగ‌స్టు 11న రిలీజ్ కాబోతున్న సంగ‌తి తెలిసిందే. అదే రోజు ర‌జ‌నీకాంత్ జైల‌ర్ సినిమా కూడా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

తొలుత జైలర్​ సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేయ‌నున్న‌ట్లు చిత్రయూనిట్ ప్ర‌క‌టించింది. కానీ ఈ రిలీజ్ డేట్ మారే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. అనివార్య కార‌ణాల వ‌ల్ల జైల‌ర్ మూడు నెల‌లు పోస్ట్‌పోన్ కానున్న‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్ 14న కాకుండా ఆగ‌స్ట్ 11న ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌నే ఆలోచ‌న‌లో చిత్ర నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ ఉన్న‌ట్లు చెబుతున్నారు.

జైల‌ర్ సినిమాలో మెహ‌న్‌లాల్‌, శివ‌రాజ్‌కుమార్‌తో పాటు త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు నెల్స‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తోన్న ఈసినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

కాగా ఎస్ఎస్ఎంబీ 28 సినిమాకు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా కూడా ఏప్రిల్ 28న రిలీజ్ కావాల్సి ఉండ‌గా ఆగ‌స్ట్ 11కు పోస్ట్‌పోన్ చేశారు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో పూజాహెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా హైద‌రాబాద్‌లోనే జ‌రుగుతోంది.

ABOUT THE AUTHOR

...view details