తమ సినిమాను ప్రమోట్ చేయడానికి మూవీటీమ్స్ పలు రకాల వినూత్న కార్యక్రమాలు చేపడుతుంటాయి. ప్రజల్లోకి తీసుకెళ్లడానికి డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తుంటాయి. తాజాగా ఓ సినిమా టీమ్ కూడా అదే చేసింది. ప్రేక్షకులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. తమ సినిమా చూసిన వారికి లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించింది. కానీ ఓ కండీషన్ పెట్టింది. అదేంటంటే.. సాయి రోనక్ హీరోగా అంకిత సాహా, బిస్మి నాస్ హీరోయిన్స్‌గా తెరకెక్కిన సినిమా రాజయోగం. కొత్త దర్శకుడు రామ్ గణపతి దీన్ని రూపొందించారు.
గతేడాది డిసెంబర్ 30న విడుదలైన ఈ చిత్రం కామెడీ ఎంటర్టైనర్గా పాజిటివ్ టాక్ దక్కించుకుంది. దీంతో ఓ ప్రెస్‌మీట్ నిర్వహించిన మూవీటీమ్.. ఆడియెన్స్ ఈ సినిమాను బాగా అస్వాదిస్తున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలోనే సినిమాను జనాల్లోకి మరింతగా తీసుకేళ్లందుకు ఓ సూపర్ ఆఫర్‌ను ప్రకటించింది. సినిమా చూసిన వారికి లక్ష రూపాలు ఇస్తామని ప్రకటించింది. కానీ ఓ షరతు పెట్టింది. సినిమా చూసి నవ్వకుండా ఉంటే ఈ నగదు బహుమతిని ఇస్తానని తెలిపింది.