తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

దుబాయ్​లో రాజమౌళి, మహేష్.. కథపై చర్చలు అక్కడే! - mahesh babu dubai trip

Rajamouli Maheshbabu: 'ఆర్​ఆర్​ఆర్​' సినిమాతో ఘనవిజయం అందుకున్న దర్శకుడు రాజమౌళి.. తన తదుపరి చిత్రం మహేష్​ బాబుతో తెరకెక్కించునున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజాగా దుబాయ్​ వెళ్లిన రాజమౌళి- మహేష్​లు అక్కడ కలవబోతున్నారని, సినిమా కథనంపై చర్చలు జరుపుతారని తెలుస్తోంది.

Rajamouli Maheshbabu
Rajamouli Maheshbabu

By

Published : Apr 24, 2022, 9:28 PM IST

Rajamouli Maheshbabu: దర్శకధీరుడు రాజమౌళి 'ఆర్​ఆర్​ఆర్​' సినిమా తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నట్లు ఇదివరకే ప్రకటించారు. 'ఆర్​ఆర్​ఆర్' కంటే భారీ స్థాయిలో ఆ సినిమా ఉంటుందని కూడా క్లారిటీ ఇచ్చారు. తొలిసారి వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడం వల్ల అభిమానుల్లో అంచనాలు విపరీతంగా ఉన్నాయి. ఇక ఈ సినిమా పనులను త్వరలోనే మొదలుపెట్టాలని జక్కన్న ఓ నిర్ణయానికి వచ్చారట. అయితే తాజాగా రాజమౌళి, మహేష్ బాబు దుబాయ్​ వెళ్లారు.

దుబాయ్​కు ఎందుకు వెళ్లినట్టు.. అయితే మహేష్ నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట' ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనకుండా.. ఏకంగా దుబాయ్​కు ఎందుకు వెళ్లారని అంతా చర్చించుకుంటున్నారు. రెండు రోజుల కిందటే షూటింగ్​ను పూర్తి చేసుకున్న మహేష్​.. దుబాయ్ ట్రిప్‌కి కారణం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఆయనతో పాటు రాజమౌళి కూడా దుబాయ్​ వెళ్లారని నెటిజన్లు చెబుతున్నారు. వీరిద్దరూ అక్కడ సినిమా స్టోరీపై చర్చించే అవకాశం ఉందని టాక్. సినిమా కోసం రాజమౌళి ఎంపిక చేసిన స్టోరీలైన్​ను మహేష్​కు వివరిస్తారని సమాచారం. అయితే దీనిపై అధికారిక సమాచారం మాత్రం లేదు.

రాజమౌళి, మహేష్ బాబు

Sarkaru Vaari Paata: మే 12న మహేష్​ 'సర్కారు వారి పాట' గ్రాండ్​గా రిలీజ్ కానుంది. మహేశ్ దుబాయ్​ నుంచి వచ్చాకే ప్రీరిలీజ్ ఈవెంట్​ను మూవీ యూనిట్​ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. కాగా, బ్యాంకింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించారు. కీర్తి సురేష్ హీరోయిన్​గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్​టైన్​మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

అరె భలే జరిగిందే.. మరోవైపు, తెలుగు చిత్ర పరిశ్రమలో ఇద్దరు హీరోల సినిమాలకు సంబంధించి ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌ నటించిన తాజా చిత్రం 'ఆర్ఆర్ఆర్‌'. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఎన్టీఆర్‌ కెరీర్‌లో ఆయనకిది 29వ చిత్రం. ఇక త్వరలోనే మహేశ్‌బాబు కథానాయకుడిగా రాజమౌళి ఓ సినిమా తెరకెక్కించనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. కాగా, మహేశ్‌బాబుకి ఇది 29వ సినిమా కావడం విశేషం. ఇలా ఒకేసారి అటు ఎన్టీఆర్‌, ఇటు మహేశ్‌ల 29వ సినిమాకు రాజమౌళినే దర్శకుడు కావడం విశేషం. అంతే కొన్నిసార్లు అనుకోకుండా అలా జరిగిపోతాయి.

మహేష్​ బాబు, ఎన్టీఆర్​

ఇవీ చదవండి:'కొరటాల శివ వల్ల 'ఆర్​ఆర్​ఆర్​'.. రాజమౌళి వల్ల 'ఆచార్య''

దేశంలో అతిపెద్ద సినిమా సెట్.. 'ధర్మస్థలి'ని తీర్చిదిద్దారిలా..

ABOUT THE AUTHOR

...view details