తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

తమిళనాడు టూర్​లో రాజమౌళి.. 'చిరకాల కోరిక నెరవేరింది' - రాజమౌళి తమిళనాడు ట్రిప్​ వీడియో

Rajamouli Tour Video : దర్శక ధీరుడు రాజమౌళి ఇటీవలే తన కుటుంబసభ్యులతో కలిసి తమిళనాడు ట్రిప్​కు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను సందర్శించిన ఆయన.. ఆ టూర్​కు సంబంధించిన ఓ స్పెషల్​ వీడియోను షేర్​ చేశారు.

Rajamouli Tour Video
Rajamouli Tamilnadu Trip

By

Published : Jul 11, 2023, 3:09 PM IST

Rajamouli Tamilnadu Trip : ఎప్పుడూ సినిమాలతో బిజీ బిజీగా ఉండే టాలీవుడ్​ స్టార్​ డైరెక్టర్ రాజమౌళి.. వాటన్నింటికి కాస్త బ్రేక్​ ఇచ్చి.. తన ఫ్యామిలీ టైమ్​ను బాగా స్పెండ్​ చేస్తూ కనిపించారు. ​ఇటీవలే తమిళనాడు టూర్ వెళ్లిన ఆయన.. అక్కడి పలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు కుటుంబసభ్యులతో పర్యటించారు. ఈ క్రమంలో తాజాగా తన ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. ఈ ప్రయాణం తనకెంతో ఉత్సాహాన్నిచ్చిందంటూ ఆయన ట్విట్టర్​ వేదికగా తెలిపారు.

"రోడ్‌ ట్రిప్‌ చేస్తూ.. తమిళనాడులోని దేవాలయాలను సందర్శించాలని నేను చాలా రోజులుగా అనుకుంటున్నాను. ఈ విషయంలో మా అమ్మాయికి ధన్యవాదాలు చెప్పాలి. జూన్‌ చివరి వారమంతా శ్రీ రంగం, బృహదీశ్వరాలయం, రామేశ్వరం, కనడుకథన్‌, తూత్తుకూడి, మధురై లాంటి ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించాం. ఆ దేవాలయాల్లోని శిల్పకళ చూసి నేను ఆశ్చర్యపోయాను. చోళుల కాలంలోనే ఎంతో గొప్ప ఇంజినీర్లు ఉన్నారు. వాళ్ల ఆధ్యాత్మిక ఆలోచనలు, ప్రతిభ అందరినీ మంత్రముగ్దులను చేస్తాయి. కుంభకోణంలోని కాక హోటల్‌, రామేశ్వరంలోని మురుగదాస్ హోటల్‌లో భోజనం ఎంతో రుచికరంగా ఉంది. నేను వారంలోనే 3 కిలోలు పెరిగాను. మూడు నెలల విదేశీ టూర్‌ తర్వాత మన దేశంలో ఇలా పుణ్యక్షేత్రాలు సందర్శించడం నాకెంతో ఉత్సాహాన్నిచ్చింది" అంటూ రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌ చూసిన నెటిజన్లు 'మీ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ 'మహాభారతం' కోసం వెళ్లారా' అంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. అప్పట్లో ఈ ట్రిప్​కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్​ అయిన సంగతి తెలిసిందే..

Rajamouli Movies : ఇక రాజమౌళి సినిమాల విషయానికొస్తే.. 'ఆర్​ఆర్​ఆర్'​ తర్వాత ఆయన తన నెక్స్ట్​ ప్రాజెక్ట్​ కోసం మహేశ్‌ బాబుతో పనిచేయనున్నారు. ఓ అడ్వెంచర్‌ మూవీ ప్లాన్‌ చేసిన ఆయన ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టింగ్​ పనులను పరిశీలిస్తున్నరని సమాచారం. అన్ని సవ్యంగా జరిగితే త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లనుందని టాక్​. మరోవైపు జూనియర్​ ఎన్టీఆర్‌ - రామ్‌చరణ్​లతో కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సీక్వెల్​ను తెరకెక్కించే ప్లాన్​లో ఉన్నారట. అలాగే మహేశ్‌ సినిమా పూర్తైన తర్వాత తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ 'మహాభారతం' మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నారట దర్శకధీరుడు.

ABOUT THE AUTHOR

...view details