''ఆర్‌ఆర్‌ఆర్ అనేది పాఠం కాదు. అదొక కథ" అని అన్నారు దర్శకుడు రాజమౌళి. ఈ సినిమాలో తమను తక్కువగా చూపించారంటూ పలువురు బ్రిటిషర్లు ఆరోపించిన నేపథ్యంలో ఇలా మాట్లాడారు. విలన్ పాత్రలో బ్రిటిష్ వ్యక్తి నటించినంత మాత్రాన బ్రిటిషర్లందరినీ విలన్లుగా చూపించినట్టు కాదని రాజమౌళి స్పష్టం చేశారు. అందరూ అలా అనుకుని ఉంటే బ్రిటన్‌లో 'ఆర్‌ఆర్‌ఆర్' విజయం సాధించలేకపోయేదని అభిప్రాయ పడ్డారు. ''సినిమా ప్రారంభానికి ముందు వచ్చే డిస్ల్కైమర్ చూసే ఉంటారు. ఒకవేళ అది మిస్ అయినా సమస్య లేదు ఎందుకంటే 'ఆర్‌ఆర్‌ఆర్' అనేది పాఠం కాదు. అదొక కథ. ఈ విషయం విలన్, హీరోలుగా నటించిన వారికి తెలుసు. ప్రేక్షకులకూ సాధారణంగా అర్థమవుతుంది. ఓ స్టోరీ టెల్లర్‌గా మనకు ఇవన్నీ అవగతమైతే ఇతర వ్యవహారాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు'' అని జక్కన్న పేర్కొన్నారు.
ఆర్ఆర్ఆర్పై బ్రిటిషర్స్ విమర్శలు.. స్పందించిన జక్కన్న - ఆర్‌ఆర్‌ఆర్ బ్రిటీషర్లు విమర్శలు
ఆర్ఆర్ఆర్లో తమను తక్కువగా చూపించారంటూ పలువురు బ్రిటిషర్లు ఆరోపించిన నేపథ్యంలో స్పందించారు దర్శకుడు రాజమౌళి.
రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని హాలీవుడ్ ప్రముఖ దర్శకులూ ప్రశంసించిన సంగతి తెలిసిందే. దర్శకత్వం, విజువల్స్, సంగీతం, యాక్షన్.. ఇలా అన్ని కోణాల్లోనూ ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచింది. బాక్సాఫీసు వద్ద రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఆస్కార్ (2023) రేసులో (బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ) నిలుస్తుందని చాలా మంది భావించారు. కానీ, ఆ అవకాశం దక్కలేదు. 'ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా'.. భారత్ తరఫున 'ఛెల్లో షో' అనే గుజరాతీ చిత్రాన్ని నామినేట్ చేసింది. దాంతో, 'ఆర్‌ఆర్‌ఆర్'ను యూఎస్‌లో పంపిణీ చేసిన వేరియన్స్ ఫిల్మ్స్ సంస్థ ఆ చిత్రాన్ని పరిశీలించాలని అకాడమీని కోరింది. అన్ని కేటగిరీలకు సంబంధించి ఓటింగ్ నిర్వహించేలా ప్రణాళికలు రచిస్తోంది. రాజమౌళి తన తదుపరి ప్రాజెక్టును మహేశ్‌బాబుతో చేస్తున్న సంగతి తెలిసిందే. సరికొత్త యాక్షన్ అడ్వెంచర్‌గా ఆ సినిమా రూపొందనుంది.
ఇదీ చూడండి: 'చిరుతో అలా చేయాలన్న కోరిక ఉండిపోయింది.. కృష్ణంరాజు వల్లే ఇదంతా'