తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

కమల్​హాసన్​ డేట్స్​ కోసం జక్కన్న, ప్రశాంత్​ నీల్​ ప్రయత్నాలు!

Rajamouli Kamalhassan: సూపర్​స్టార్​ మహేశ్​బాబుతో చేయబోయే సినిమాలో ఓ కీలక పాత్ర కోసం దిగ్గజ నటుడు కమల్​హాసన్​ను సంప్రదించాలని దర్శకుడు రాజమౌళి యోచిస్తున్నట్లు తెలిసింది. ఇటీవలే ఎన్టీఆర్​తో చేయబోయే చిత్రం కోసం కమల్​ను సంప్రదించాలని దర్శకుడు ప్రశాంత్ నీల్​ కూడా ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

Rajamouli kamalhassan movie
కమల్​హాసన్​ డేట్స్​ కోసం జక్కన్న, ప్రశాంత్​ నీల్​

By

Published : May 22, 2022, 12:34 PM IST

Rajamouli Kamalhassan: సినీప్రియుల్లో జోష్​ను నింపే వార్త మరొకటి ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతోంది. ఎన్టీఆర్​తో చేయబోయే భారీ యాక్షన్​ డ్రామా సినిమాలో ఓ కీలక పాత్ర కోసం యూనివర్సల్​ స్టార్​ కమల్​హాసన్​ను సంప్రదించాలని దర్శకుడు ప్రశాంత్​ నీల్​ భావిస్తున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి. ఆ రోల్​ మూవీకే హైలైట్​గా నిలవనుందని మాట్లాడుకున్నారు. అయితే ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి కూడా కమల్​ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. జక్కన్న తన తర్వాతి సినిమాను సూపర్​స్టార్​ మహేశ్​బాబుతో చేయనున్నారు. 'ఎస్​ఎస్​ఎమ్​బీ29'గా రూపొందనున్న ఈ మూవీలో ఓ ప్రత్యేక పాత్రను కమల్​హాసన్​ మాత్రమే చేయగలరని రాజమౌళి భావిస్తున్నారట. అందుకోసం యూనివర్సల్​ స్టార్​ను సంప్రదించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆఫ్రికన్​ జంగిల్​ బ్యాక్​డ్రాప్​లో అడ్వంచరస్​ థ్రిల్లర్​గా ఈ సినిమా రూపొందనుందని ఇటీవలే కథనాలు వచ్చాయి.

ఒకవేళ ప్రశాంత్​ నీల్​, రాజమౌళి తెరకెక్కించబోయే సినిమాల్లో కమల్​హాసన్​ నటిస్తే సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరిపోతాయి. అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. కాగా, కమల్​ త్వరలోనే 'విక్రమ్'​ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇందులో స్టార్ హీరోలు సూర్య, విజయ్​ సేతుపతి, ఫహద్​ ఫాజిల్​ కీలక పాత్రలు పోషించడం విశేషం.

ఇదీ చూడండి:వారికి లీగల్​ నోటీసులు పంపిన ధనుష్​.. రూ.10కోట్లు కట్టాలంటూ!

ABOUT THE AUTHOR

...view details