తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ఆర్​ఆర్​ఆర్'​ సీక్వెల్​.. జక్కన్న, తారక్​, చరణ్​ ఏం అన్నారంటే? - RRR movie ajaydevgan

NTR Ramcharan RRR Sequel: ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించి రికార్డులు సృష్టిస్తోంది 'ఆర్​ఆర్​ఆర్'. ఈ సినిమాకు సీక్వెల్​ తీస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించారు హీరోలు ఎన్టీఆర్​, రామ్​చరణ్​. రెండో భాగాన్ని కచ్చితంగా తెరకెక్కించాల్సిన అవసరముందని తారక్​ అనగా.. అది స్వాగతించదగ్గ విషయమని చరణ్​ అన్నారు. మరి రాజమౌళి ఏం అన్నారంటే..

RRR sequel
ఆర్​ఆర్​ఆర్ సీక్వెల్​

By

Published : Apr 7, 2022, 12:30 PM IST

NTR Ramcharan RRR Sequel: 'బాహుబలి' తరహాలో 'ఆర్​ఆర్​ఆర్'​కు కూడా సీక్వెల్​ ఉండాల్సిన అవసరముందని అన్నారు హీరో ఎన్టీఆర్​. దర్శకధీరుడు రాజమౌళి.. కచ్చితంగా రెండో భాగాన్ని తెరకెక్కించాలని చెప్పారు. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించి బాక్సాఫీస్​ ముందు రికార్డులు సృష్టిస్తోంది. విడుదలై 13 రోజులు అవుతున్నా కలెక్షన్లలో ఏ మాత్రం జోరు తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా రూ.వెయ్యి కోట్లు సాధించింది. ఈ నేపథ్యంలో ఉత్తరాది థియేట్రికల్​ రైట్స్​ సహా అన్ని భాషల్లో డిజిటల్​, శాటిలైట్​ రైట్స్ కొనుగోలు చేసిన పెన్ స్టూడియోస్​ అధినేత జయంతిలాల్​.. ముంబయిలో సక్సెస్​ ప్రెస్​ ఈవెంట్​ను నిర్వహించారు. ఇందులోనే 'ఆర్​ఆర్​ఆర్'​ సీక్వెల్​పై ఓ జర్నలిస్ట్​ అడిగిన ప్రశ్నకు.. తారక్ పై వ్యాఖ్యలు చేశారు.

"ఆర్ఆర్​ఆర్​కు సీక్వెల్​ తీయాలని అభిమానులు చేస్తున్న డిమాండ్​​ సమంజసమైనదే. జక్కన్న తీయకపోతే ఆయన్ను వారు తప్పకుండా చంపేస్తారు(నవ్వుతూ). ఆయన ఈ చిత్రానికి కంక్లూజన్(రెండో భాగం) తెరకెక్కించాల్సిన అవసరం ఉంది. ఇది జరుగుతుందని ఆశిస్తున్నా" అని తారక్​ అన్నారు.

ఆర్ార్​ఆర్​ సక్సెస్​ మీట

అనేక వాయిదాల పర్వాన్ని దాటుకుని ఎట్టకేలకు 'ఆర్​ఆర్​ఆర్'​ ప్రేక్షకుల ముందుకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు రామ్​చరణ్​. 'ఆర్​ఆర్​ఆర్'​ సీక్వెల్​పై మాట్లాడుతూ.. "రాజమౌళి సార్ రెండో భాగం తెరకెక్కిస్తే మేమందరం మళ్లీ సంతోషిస్తాం" అని పేర్కొన్నారు.

'ఆర్​ఆర్​ఆర్'​ సినిమా వల్ల తన మెదడు వేడెక్కిపోయిందని దాన్ని చల్లబరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు దర్శకుడు రాజమౌళి. "ఈ సినిమా ఆలోచనల నుంచి ఎన్టీఆర్​, రామ్​చరణ్​ త్వరగానే బయటకు వచ్చారు. కానీ నాకు ఇంకాస్త సమయం పడుతుంది. దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నా. ఇక 'ఆర్​ఆర్​ఆర్​ 2' విషయానికొస్తే.. దాన్ని తెరకెక్కించడం నాకు కూడా ఆనందాన్నిస్తుంది. అయితే అది బాక్సాఫీస్ వద్ద ఏమి చేస్తుందో అని కాదు.. నా సోదరులతో(తారక్​, చెర్రీ) కలిసి గడపడానికి మరింత ఎక్కువ సమయం దొరుకుతుందని. మరి ఏం జరుగుతుందో చూడాలి." అని జక్కన్న అన్నారు.

ఆర్ార్​ఆర్​ సక్సెస్​ మీట

యాక్షన్‌, ఎమోషనల్‌ డ్రామాగా రూపొందిన 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్​గా తారక్‌ నటించారు. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మించారు. కీరవాణి స్వరాలు అందించారు. ఆలియాభట్‌ , ఒలీవియా మోరిస్‌ కథానాయికలు. శ్రియ, సముద్రఖని, అజయ్‌ దేవ్‌గణ్‌ కీలకపాత్రల్లో కనిపించారు.


ఇదీ చూడండి: నైజాంలో 'ఆర్​ఆర్​ఆర్' ప్రభంజనం​.. తొలి సినిమాగా చరిత్ర

ABOUT THE AUTHOR

...view details