తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రాజమౌళితో సినిమా.. ఆ విషయంలో మహేశ్​దే తుది నిర్ణయం​ - రాజమౌళి మహేశ్​బాబు సినిమా అప్డేట్స్​

Mahesh babu Rajamouli movie: దర్శకధీరుడు రాజమౌళితో చేయబోయే సినిమా గురించి మాట్లాడారు సూపర్​స్టార్​ మహేశ్​బాబు. చిత్రానికి సంబంధించి కొన్ని ఆలోచనలపై ఇప్పటికే తామిద్దరు చర్చించినట్లు వెల్లడించారు.

Rajamouli Mahesh babu movie
రాజమౌళి మహేశ్​ సినిమా

By

Published : Jun 3, 2022, 1:43 PM IST

Mahesh babu Rajamouli movie: 'ఆర్ఆర్ఆర్‌'తో రాజమౌళి.. 'సర్కారువారి పాట'తో మహేశ్‌బాబు విజయానందాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మహేశ్‌ నటించేందుకు సిద్ధమవుతుండగా, రాజమౌళి తన తర్వాతి సినిమాకు సంబంధించిన పూర్వ నిర్మాణ పనుల్లో నిమగ్నం కానున్నారు. త్రివిక్రమతో సినిమా అయిపోగానే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో మహేశ్‌ నటించనున్నారు. వీరి కాంబినేషన్‌లో వచ్చే మూవీ ఆఫ్రికన్‌ అడవి నేపథ్యంలో యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీగా ఉండనుంది. దీంతో అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేశ్‌బాబు.. "రాజమౌళితో సినిమా విషయమై కొన్ని ఆలోచనలపై ఇప్పటికే చర్చించాం. ప్రస్తుతానికి దేనిపైనా స్పష్టత రాలేదు. ఈ సినిమా గురించి ఇప్పుడే మాట్లాడటం చాలా తొందర అవుతుంది. కానీ, నా కల సాకారమవుతోంది. మేమిద్దరం కలిసి పనిచేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాం. ఎట్టకేలకు అది త్వరలోనే సాధ్యం కానుంది. ఆయనతో సినిమా చేసేందుకు నేను చాలా ఉత్సుకతతో ఉన్నాను" అని మహేశ్‌ అన్నారు.

ఇక తాను సినిమా కథల ఎంపిక గురించి మాట్లాడుతూ.. "నేను ఏ కథ, సినిమా ఒప్పుకొన్నా నా గట్‌ ఫీలింగ్‌తో ముందుకు వెళ్తా. నాకు అదే నచ్చుతుంది. నేను ఏ ప్రాజెక్టుకు ఒప్పుకొన్నా ఎవరితోనూ చర్చించను. ఆ విషయంలో నాదే తుది నిర్ణయం. అడవి శేష్‌తో ‘మేజర్‌’ చేస్తున్నామని శరత్‌, అనురాగ్‌లు చెప్పినప్పుడు కూడా ఎవరితోనూ చర్చించకుండా ‘యస్‌’ అనే సమాధానం చెప్పా" అని మహేశ్‌ చెప్పుకొచ్చారు.

ఇదీ చూడండి: పవన్​ మూవీ నుంచి పూజా ఔట్​.. ​చరణ్​ కొత్త సినిమా కోసం అనిరుధ్​!

ABOUT THE AUTHOR

...view details