తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ఫ్యామిలీ మ్యాన్' డైరెక్టర్స్​తో విజయ్.. రంగంలోకి టాప్ ప్రొడక్షన్ హౌస్! - విజయ్ దేవరకొండ దిల్​రాజు సినిమా

హీరో విజయ్​ దేవరకొండ.. 'లైగర్'​ సినిమా తర్వాత తన తదుపరి సినిమాలపై దృష్టి పెడుతున్నారు. తాజాగా రౌడీ హీరో​ కొత్త మూవీకు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్​తో సౌత్​లో పాపులర్ అయిన దర్శకులు రాజ్​, డీకే.. విజయ్​తో సినిమా చేయాలనుకుంటున్నారని సమాచారం.

vijay devarkonda
vijay devarkonda

By

Published : Sep 10, 2022, 5:54 PM IST

ఇటీవల 'లైగర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు విజయ్ దేవరకొండ. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయింది. దాదాపు రూ.60 కోట్లకు పైగా నష్టాలొచ్చినట్లు సమాచారం. ఈ సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు విజయ్ తన తదుపరి సినిమాలపై దృష్టి పెడుతున్నారు. లిస్ట్​లో ఎన్ని ఫ్లాప్​ సినిమాలున్నా.. విజయ్​తో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు దర్శకనిర్మాతలు.

ఇప్పటికే అగ్ర నిర్మాత అశ్వనీదత్.. విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే సరైన కథ మాత్రం దొరకలేదు. ఇప్పుడు కథను లాక్ చేసినట్లు తెలుస్తోంది. 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్​తో దక్షిణాదిలో పాపులర్ అయిన రాజ్ అండ్ డీకే దర్శకులు విజయ్​తో సినిమా చేయాలనుకుంటున్నారట. ఇటీవల వారు చెప్పిన కథ విజయ్​కు నచ్చిందట. అదే కథ అశ్వనీదత్ దగ్గరకు తీసుకెళ్లగా.. దాదాపు ఫైనల్​ అయినట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించనున్నారట.

దిల్​రాజుతో విజయ్ సినిమా..
నిర్మాత దిల్​రాజు కూడా విజయ్​తో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 'అర్జున్ రెడ్డి' తరువాత విజయ్​కు అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతల్లో దిల్​రాజు కూడా ఒకరు. ఇప్పుడు దిల్​రాజుతో కలిసి పని చేయడానికి విజయ్​ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. దాంతో పాటు ప్రస్తుతం విజయ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అవే 'ఖుషీ', 'జనగణమన'. అయితే 'జనగణమన' క్యాన్సిల్ అయిందని టాక్.

ఇవీ చదవండి:విక్రమ్@100 రోజులు.. కమల్​ వాయిస్​ ట్వీట్​ వైరల్​!

అభిమాని చేసిన ఆ పనికి హృతిక్​ రోషన్​ ఫుల్​ సీరియస్!

ABOUT THE AUTHOR

...view details