తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

లారెన్స్​ జర్నీలో ఎన్నో కష్టాలు - రజనీకాంత్​ వల్లే అలా మారారట! - రాఘవ లారెన్స్ బయోగ్రఫీ

Raghava Lawrence Biography : కోలీవుడ్ స్టార్ రాఘవ లారెన్స్​ గురించి ఆడియెన్స్​కు స్పెషల్ ఇంట్రడక్షన్​ ఇవ్వాల్సిన అవసరం లేదు. తన నటనతో , డ్యాన్స్​తో, డైరెక్షన్​ స్కిల్స్​తో ఈయన అందరికీ సుపరిచితుడే. అంతే కాకుండా సమాజ సేవలో నిమగ్నమై ఎంతో మందికి అండగా నిలిచారు. ఎన్నో ప్రాణాలను నిలబెట్టారు. అయితే చిన్నవయసులో ఆయన ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు.

Raghava Lawrence
Raghava Lawrence

By ETV Bharat Telugu Team

Published : Dec 31, 2023, 2:22 PM IST

Raghava Lawrence Biography : సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే అంతా సులువైన విషయమేమీ కాదని అంటుంటారు. అయితే పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే అవేవి కష్టం కాదని ఎందరో సినీ తారలు మనకు నిరూపించారు. అలా స్వయంకృషితో అంచెలంచెలుగా ఏదిగి ప్రపంచానికి తానేంటో నిరూపించుకున్నారు కోలీవుడ్ స్టార్ రాఘవ లారెన్స్. ఓ నటుడిగా, కొరియోగ్రాఫర్​గా, డైరెక్టర్​గా, నిర్మాతగా ఇలా అన్నింటిలోనూ తన అద్భుత ప్రతిభను కనబరిచి సౌత్​లో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు లారెన్స్. అయితే ఆయన సినీ జర్నీ అంత సులభంగా ఏం సాగలేదు. ఆయన జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు, మరెన్నో కష్టాలను ఎదుర్కొన్నారు.

ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేస్తూ ప్రాణదాతగా నిలుస్తున్న లారెన్స్ చిన్నప్పుడు ఓ భయంకరమైన ప్రాణాంతక వ్యాధితో పోరాడారు. చిన్న వయసులోనే బ్రెయిన్ ట్యూమర్​తో లారెన్స్ ఎన్నో ఇబ్బందులు పడ్డారట. తనకు బ్రెయిన్ ట్యూమర్ అని తెలిసి తన తల్లి ఎంతోమంది డాక్టర్ల దగ్గర చికిత్స ఇప్పించినప్పటికీ ఫలితం దక్కలేదట. దీంతో లారెన్స్ తల్లి మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని ప్రార్థిస్తూ మరోవైపు తన కొడుకుకు డాక్టర్లతో చికిత్స అందించింది. చివరకు తన పూజలకు ఫలితం దక్కి వ్యాధి తగ్గిపోయింది. దీంతో లారెన్స్ కుటుంబం మొత్తం శ్రీరాఘవేంద్రుడి భక్తులుగా మారిపోయారు. లారెన్స్ పేరు పక్కన రాఘవ అని కూడా చేర్చుకున్నారు.

ఆ తర్వాత లారెన్స్ ఎదుగుతున్న కొద్ది మరిన్ని కష్టాలు ఆయన్ను పలకరించాయి. పేదరికం వల్ల రాఘవ తనకు వచ్చిన ప్రతి చిన్నా, పెద్దా పనులు చేసేవారు. చివరకు కార్ క్లీనర్‌గా మారారట. అయితే రాఘవ లారెన్స్ జీవితాన్ని మలుపు తిప్పిన క్రెడిట్ మొత్తం సూపర్ స్టార్ రజనీకాంత్‌కి చెందుతుందని ఆయన ఒకానొక సందర్భంలో రాఘవ చెప్పుకొచ్చారు. ఒకసారి రాఘవ డ్యాన్స్ చూసి ఇంప్రెస్ అయ్యి అతన్ని డాన్సర్స్ యూనియన్‌లో చేర్చుకున్నారని దీంతో అక్కడి నుండి లారెన్స్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ సమయంలో చిరంజీవి తన 'హిట్లర్' సినిమాలో కొరియాగ్రఫీ కోసం రాఘవని ఎంచుకున్నారు. అక్కడి నుంచి లారెన్స్ జీవితం పూర్తిగా మారిపోయింది.

రాఘవ డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీలో తన కెరీర్‌ను ప్రారంభించి నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుని అక్కడ కూడా విజయాన్ని అందుకున్నారు. రాఘవ మంచి డ్యాన్సర్, నటుడుగానే కాకుండా డైరెక్టర్​, కంపోజర్‌గా, ప్లేబ్యాక్ సింగర్‌గా కూడా రాణించారు. 2007లో విడుదలైన 'ముని' చిత్రం ద్వారా డైరెక్టర్​గా మంచి పేరు తెచ్చుకున్న రాఘవ స్వయంగా ఈ చిత్రాన్ని 2020లో 'లక్ష్మీ' అనే పేరుతో హిందీలో రీమేక్ చేశారు. సామాజిక సేవల్లోనూ తనదైన ముద్ర వేశారు రాఘవ. చిన్నతనంలో పేదరికాన్ని చూసిన ఆయన అనాథ పిల్లలను ఆదుకోవడానికి ఎప్పుడు వెనుకాడలేదు. ఎందరో అనాథ పిల్లలను దత్తత తీసుకుని పెంచారు. దీంతో పాటు వికలాంగులకు అండగా నిలిచారు.

అప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా: లారెన్స్

Chandramukhi 2 Flop : 'మనశ్శాంతి ఉండటం లేదు.. నిద్రపోయినా కూడా అవే ఆలోచనలు'

ABOUT THE AUTHOR

...view details