ఓ సినిమాలో హీరో చిరంజీవిని కొట్టే సన్నివేశం బాగా పండేందుకు 23 టేకులు తీసుకున్నానని, అలా 23 సార్లు కొట్టడంతో ఆయన ముఖం ఎరుపెక్కిందని రాధిక అన్నారు. 'ఆలీ' వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసిన ఈమె నాటి జ్ఞాపకాల్ని గుర్తుచేసుకున్నారు. ఆలీతో కలిసి సూపర్‌హిట్ గీతం ‘సందె పొద్దులకాడ’ పాటకు డ్యాన్ చేసి అలరించారు. చంద్రమోహన్‌తో కలిసి నటించిన ‘మూడు ముళ్లు’ షూటింగ్, దర్శకుడు కోదండ రామిరెడ్డి, తన హెయిర్ డ్రెస్సర్ రీటా సంగతులు పంచుకున్నారు.
పాపం చిరంజీవి.. రాధిక ఎంత పని చేసింది...!
'ఆలీ' వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి ఈ వారం ప్రముఖ నటి రాధిక వచ్చారు. ఈ సందర్భంగా నాటి జ్ఞాపకాల్ని గుర్తుచేసుకున్నారు. పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
దర్శకుడు భారతీరాజాతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. తనకెలాంటి బేధభావం లేదని, అన్ని మతాల పండగలను జరుపుకొంటానని తెలిపారు. బుల్లితెరపైకి వచ్చేందుకు కారణమేంటో వివరించారు. శరత్‌కుమార్‌తో పరిచయం, పెళ్లి ఎలా జరిగిందో చెప్పారు. మరి చిరంజీవిని కొట్టిన ఆ సీన్ ఏ సినిమాలోది?అనే ప్రశ్నకు సమాధానంతోపాటు మరిన్ని ముచ్చట్లతో కూడిన పూర్తి ఎపిసోడ్ ‘ఈటీవీ’లో ఏప్రిల్ 18న రాత్రి 9:30 గం.లకు ప్రసారంకానుంది. ప్రస్తుతం ప్రోమో నెట్టింట సందడి చేస్తోంది.
ఇదీ చదవండి: పెళ్లి దుస్తుల్లో ఆలియా ఎంత అందంగా ఉందో..