తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ఆ హీరోయిన్​ అంటే క్రష్​ - పెళ్లి చేసుకోవటమే లక్ష్యంగా పెట్టుకున్నా' - ఆర్ మాధవన్ జూహీ చావ్లా న్యూస్

R Madhavan Juhi Chawla : సీనియర్ స్టార్ హీరో మాధవన్​ తాజాగా నటించిన వెబ్​ సిరీస్​ 'ది రైల్వే మెన్'..ప్రస్తుతం పాజిటివ్​ టాక్​ను సొంతం చేసుకుని దూసుకెళ్తోంది. అయితే ఈ సిరీస్​ ప్రమోషన్​లో భాగంగా తనతో కలిసి నటించిన నటి జూహీ చావ్లాపై తన మనసులో ఉన్న మాటాలను బయట పెట్టారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

R Madhavan Juhi Chawla
R Madhavan Juhi Chawla

By ETV Bharat Telugu Team

Published : Nov 22, 2023, 8:00 PM IST

R Madhavan Juhi Chawla : సీనియర్ స్టార్ హీరో మాధవన్ వరుసగా సినిమాలు, సిరీస్​లు చేస్తూ ఫుల్ జోష్​లో ఉన్నారు. ఆయనకు తగ్గ పాత్రలు కమిట్ అవుతూ.. డీఫరెంట్ సబ్జెక్ట్​లను ఎంపిక చేసుకుంటూ మళ్లీ బిజీగా అయ్యారు. ప్రేక్షకులను సైతం మెప్పిస్తున్నారు. ప్రస్తుతం మాధవన్ నటించిన 'ది రైల్వే మెన్' వెబ్​ సిరీస్ నెట్​ఫిక్స్​లో మంచి పాజిటివ్ టాక్​కు కొనసాగతోంది. ఇక ఈ సీరిస్​ ప్రమోషన్స్​లో భాగంగా మాధవన్​ ఆసక్తికర విషయాలు బయట పెట్టారు.

'ది రైల్వే మెన్' సిరీస్​లో మాధవన్​తో పాటు బాలీవుడ్ భామ జూహీ చావ్లా నటించారు. అయితే తాను ప్రేమించిన అమ్మాయి జూహీనే అని చెప్పాడు. " నా అదృష్టం బావుండి జూహీ చావ్లా ఈ సిరీస్​కు ఓకే చెప్పారు. నేను కెరీర్​ స్టార్​ చేయకుముందు.. 'ఖయామత్ సే ఖయామత్' సినిమాలో జూహీని చూసి.. పెళ్లి చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. ఈ విషయం మా అమ్మకు కూడా చెప్పాను. ఇంకా చెప్పాలంటే తనని పెళ్లి చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాను." అని మాధవన్ చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇక 'ది రైల్వే మెన్' విషయానికొస్తే.. 1984 డిసెంబర్​ 2న జరిగిన భోపాల్ గ్యాస్​ లీక్ దుర్ఘటన ఆధారంగా తెరకెక్కించారు. గ్యాస్​ లీకైన రోజు.. ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రజలు పడిన అవస్థలను చూపించారు. అలానే అదే రోజు ప్రాణాలను పణంగా పెట్టి వందలాది మంది పౌరుల జీవితాలను కాపాడిన రైల్వే ఉద్యోగులు ఏం చేశారు? ఏ విధంగా భోపాల్ రైల్వేస్టేషన్​లో ఉన్న ప్రయాణికులను కాపాడారు అనే కథ నేపథ్యంలో తీర్చిదిద్దారు. ఆయుష్ గుప్తా రచించిన ఈ సిరీస్​ని శివ్ రావైల్ డైరెక్ట్ చేశారు. మాధవన్, బాబిల్ ఖాన్, కేకే మీనన్, దివేందు శర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌, ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో రూపొందిచిన ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ నెట్​ఫ్లిక్స్​లో నవంబర్ 18 నుంచి స్ట్రీమింగ్​ అవుతోంది. మొత్తం నాలుగు ఎపిసోడ్స్ కలిగి ఉన్న ఈ వెబ్ సిరీస్ హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది.

ఏడు మెడల్స్​తో సత్తా చాటిన కుమారుడు.. పుత్రోత్సాహంతో పొంగిపోయిన మాధవన్..​

రాకెట్రీ కోసం మాధవన్​ ఇల్లు అమ్ముకున్నారా, ఇదిగో ప్రూఫ్​

ABOUT THE AUTHOR

...view details