ప్రముఖ అమెరికన్ సింగర్ ఆర్ కెల్లీకి (55) 30 ఏళ్ల జైలు శిక్ష పడింది. తన పాపులారిటీని ఉపయోగించి తనను అనుసరించే యువతులపై పదేపదే లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో అతడు దోషిగా తేలాడు. బాధితుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. వారిని బంధించి వ్యభిచారం కోసం అక్రమంగా తరలించాడని విచారణలో తేలింది.
ఈ కేసులో 2019 జులై నుంచే కెల్లీ జైలు శిక్ష అనుభవిస్తుండగా.. మానవ అక్రమ రవాణా సహా మరికొన్ని కేసుల్లో దోషిగా తేలడం వల్ల బుధవారం అతడికి 30 ఏళ్ల జైలు శిక్ష పడింది. చైల్డ్ పోర్నోగ్రఫీ, న్యాయప్రక్రియకు ఆటంకం కలిగించడం వంటి ఆరోపణలు అతడిపై ఇంకా కొనసాగుతున్నాయి. వాటిపై ఆగస్టులో విచారణ జరగనుంది.