తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మూవీ లవర్స్​కు గుడ్​న్యూస్​.. రూ.99కే సినిమా చూసే ఛాన్స్! ఆరోజు మాత్రమే.. - పీవీఆర్‌ టికెట్​ రేట్​

సినీ లవర్స్​ కోసం ప్రముఖ మల్టీ ప్లెక్స్ సంస్థ పీవీఆర్​ ఓ గుడ్​ న్యూస్​ను ప్రకటించింది. ఆ ఒక్క రోజు టికెట్​పై బంపర్​ ఆఫర్ ఇవ్వనున్నట్లు తెలిపింది.

pvr multiplex ticket rate on 20th january
pvr

By

Published : Jan 17, 2023, 9:36 PM IST

మల్టీప్లెక్స్​ల్లో టికెట్​ రేట్లు మండిపోతున్న ఈ కాలంతో రూ.99కే సినిమా చూడోచ్చు అంటే ఎవరు కాదంటారు. ప్రముఖ మల్టిప్లెక్స్ సంస్థ పీవీఆర్‌.. సినీ లవర్స్​ కోసం ఈ బంపర్ ఆఫర్‌ ప్రకటించింది. సెంటర్​ ఏదైనా, సినిమా ఏదైనా ఇదే రేటుకు చూసే అవకాశం ఉంటుందని తెలిపింది. అయితే ఈ ఆఫర్‌ ఒక్క కేవలం ఒక్కరోజుకే వర్తిస్తుందని అనౌన్స్​ చేసింది.

జనవరి 20న 'సినిమా లవర్స్‌ డే' సందర్భంగా ఈ క్రేజీ ఆఫర్​ను అమలులోకి తీసుకురానుంది. అయితే అన్ని నగరాల్లో ఇదే ఉంటుందని గ్యారంటీ లేదు. చంఢీగఢ్‌, పుదుచ్చెరి, పఠాన్‌కోట్‌లాంటి నగరాలకు ఈ ఆఫర్‌ వర్తించదు. మరోవైపు ఆంధ్ర కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో రూ.100+జీఎస్టీ వసూలు చేయనున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే రూ.112+జీఎస్టీకి టికెట్‌ అందుబాటులో ఉంటుందట. ప్రీమియం కేటగిరి సీట్స్‌ (రెక్లెయినర్‌, ఐమ్యాక్స్‌, 4డీఎక్స్‌ తదితర సమాన స్థాయిలు కలిగిన సీట్లు) ఈ ఆఫర్‌ పరిధిలోకి రావని స్పష్టం చేసింది. ఇక జనవరి 20న ఇతర ఏ ఆఫర్లు వర్తించవని మరిన్ని వివరాలకు పీవీఆర్‌ సినిమాస్‌ వెబ్‌సైట్‌లో చూడొచ్చని సంస్థ తెలిపింది. కాగా 2022 సెప్టెంబర్‌ 16న ఇదే తరహా ఆఫర్​తో మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ముందుకొచ్చింది. 'నేషనల్‌ సినిమా డే' సందర్భంగా దేశవ్యాప్తంగా కేవలం రూ.75కే టికెట్లను విక్రయించింది.

ABOUT THE AUTHOR

...view details