తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Pushpa 2 Release Date : నేషనల్ అవార్డు విన్నింగ్ జోష్​లో బన్నీ.. పుష్ప-2 రిలీజ్ ఎప్పుడంటే? - బన్ని జాతీయ అవార్డు

Pushpa 2 Release Date : జాతీయ అవార్డు విజేత అల్లు అర్జున్ 'పుష్ప ద రూల్' సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా విడుదలపై మూవీమేకర్స్ ఓ క్లారిటీకి వచ్చేసినట్లు తెలుస్తోంది. మరి పుష్ప-2 సినిమా విడుదల ఎప్పుడంటే?

Pushpa 2 Release Date
Pushpa 2 Release Date

By ETV Bharat Telugu Team

Published : Aug 25, 2023, 5:39 PM IST

Updated : Aug 25, 2023, 8:36 PM IST

Pushpa 2 Release Date :'పుష్ప' ఇప్పుడు దేశంలో ఫుల్​ ట్రెండింగ్​లో ఉన్న పేరు ఇదే. 'పుష్ప ద రైజ్​' సినిమాలో అల్లు అర్జున్ నటనకుగాను.. తాజాగా జాతీయ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం షూటింగ్ పనులు జరుపుకుంటున్న 'పుష్ప ద రూల్' సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో పుష్ప సీక్వెల్​పై ఓ ఇంట్రెస్టింగ్ బజ్​ క్రియేట్ అయ్యింది.

అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న 'పుష్ప ద రూల్' సినిమా విడుదలపై మూవీ మేకర్స్ ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవి కానుకగా థియేటర్లలో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు ఇన్​సైట్​ టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో 2024 మార్చి 22న లేదా ఆ తర్వాత వారం 29న రెండింట్లో ఏదో ఒక డేట్​ను మూవీ మేకర్స్​ ఫిక్స్​ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే కీలక సన్నివేశాలు సహా.. దాదాపు 70 శాతానికి పైగా షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా.. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నాయట.

Pushpa 2 Cast :పుష్పసీక్వెల్​లో బన్నీ సరసన రష్మికా మందన్నా హీరోయిన్​గా నటిస్తున్నారు. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, జగపతి బాబు, ప్రియమణి, ఫహాద్ ఫాజిల్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాక్​స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్​పై నవీన్ యర్నేని, రవి శంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

రికార్డులు సృష్టించిన పుష్ప ద రైజ్..
2021లో రిలీజైన పుష్ప ద రైజ్ సినిమా.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ చిత్రంతో హీరో అల్లు అర్జున్ పాన్ఇండియా స్టార్​గా ఎదిగారు. సినిమాలో బన్నీ మేనరిజానికి దేశంలో సపరేట్ ఫ్యాన్​బేస్ ఏర్పడింది. భారీ విజయాన్ని సొంతం చేసుకున్న పుష్ప.. బాక్సాఫీస్ వద్ద కాసుల (సుమారు రూ. 300 కోట్ల పైనే) వర్షం కురిపించింది. దీంతో బన్నీ కెరీర్​లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

allu arjun national award 2023 : బన్నీ ఇంటికి 'పుష్ప' టీమ్... అల్లు అర్జున్​ను చూడగానే సుక్కు ఎమోషనల్

National Film Awards Prize Money : నేషనల్ ఫిల్మ్ అవార్డ్​ విజేతలకు ఎంత ప్రైజ్​మనీ ఇస్తారో తెలుసా?

Last Updated : Aug 25, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

...view details